Russia Ukraine War: క్షణక్షణం.. భయం భయం.. బంకర్లలో బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు

|

Feb 26, 2022 | 7:18 AM

ఉక్రెయిన్‎పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షణక్షణం. భయం భయం. కొందరు ఎలాగో అలా బయట పడుతున్నారు.

Russia Ukraine War: క్షణక్షణం.. భయం భయం.. బంకర్లలో బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు
Ukraune
Follow us on

Telugu Students in Ukraine: ఉక్రెయిన్‎పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షణక్షణం. భయం భయం. కొందరు ఎలాగో అలా బయట పడుతున్నారు. మరికొందరు బంకర్లలోకి వెళతున్నారు. ఉక్రెయిన్‌లో మన తెలుగు విద్యార్థుల(Telugu Students) బాధలు అన్నీఇన్నీ కావు. తమను ఎలాగైనా తీసుకెళ్లాలంటూ భారత ఎంబసీ(Indian Embassy)ని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Indian Government) చొరవతో ఉక్రెయిన్‌ నుంచి మన వాళ్ల తరలింపు మొదలైంది. ఉక్రెయిన్‌లో చాలా సిటీల నుంచి రొమేనియా చేరుకున్న వారంతా ప్రత్యేక విమానంలో మన దేశానికి బయలుదేరారు. ఇందులో 470 మంది ఉన్నారు. ఈ ఫ్లైట్‌ ఈ మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అందులో మన తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రొమేనియా నుంచి భారతీయులతో ఒక విమానం ఢిల్లీకి పయనమైంది. మొత్తం 13 మంది వైద్య విద్యార్థులు ఆ ప్రత్యేక విమానంలో ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారు నలుగురు ఉన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన రాజులపాటి అనూష, చిత్తూరు జిల్లాకు చెందిన తూటుకూరి హర్షిత, తెలంగాణకు చెందిన గంగరాజు నాగశ్రీకరి, నీలా హర్షవర్ధన్‌ ఇవాళ రాబోతున్నారు. ట్రావెల్‌ ఫెసిలిటీ లేని వారు ఇంకా అక్కడే భయం భయంగా గడుపుతున్నారు. కొందరు బంకర్లలోకి వెళుతున్నారు. ప్రత్యామ్నాయ ఎయిర్‌పోర్టులకు దూరంగా ఉన్న వారు బంకర్లలో తలదాచుకుంటున్నారు. జెఫోరిషియ సిటీలో కొందరు తెలుగు విద్యార్థులు ఇంకా అక్కడే ఉన్నారు.

ఇదిలావుంటే, ఉక్రెయిన్‎పై రష్యా దాడులు ప్రారంభించగానే అక్కడి కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులను బంకర్‎లోకి వెళ్లాలంటూ కొన్ని యూనివర్సిటీలు ఆదేశించాయి. దాంతో కొందరు విద్యార్థులు కలిసి తమ నివాస స్థలానికి దగ్గర్లో ఉన్న బంకర్‎లోకి వెళ్లారు. అక్కడి నుంచి వీడియో తీసి తమ తల్లిదండ్రులకు పంపుతున్నారు. ప్రస్తుతం తామందరం క్షేమంగానే ఉన్నామని తెలిపారు. యూనివర్సిటీ అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉన్నామని.. ఎవరూ భయపడొద్దని పేరెంట్స్‎కు చెబుతున్నారు. కాగా.. విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని వారి తల్లిదండ్రులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తన పిల్లలను క్షేమంగా తిరిగి తీసుకురావాలని ఐటీ మంత్రి కేటీఆర్‎కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.


ముందస్తు హెచ్చరికలు ప్రభుత్వాలు జారీ చేసినప్పటికీ సమస్య యుద్ధం వరకు వెళ్లదని అంతా భావించారు. కానీ పుతిన్‌ ప్రకటనతో తాజాగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ ఎటూ పోవాలో తెలియక చిక్కుకుపోయారు. సుమారు 18 వేల మంది భారతీయులు అందులో అధికంగా విద్యార్ధులు ఉన్నారు. ప్రస్తుతం చేతులో సరిపడా డబ్బులు లేక అరకొర ఆహారం తీసుకుంటూ ఎటువెళ్లాలో తెలియని స్థితిలో వారు గడుపుతున్నారు. త్వరగా భారత్ వచ్చేయాలన్న ఆతృతతో ఉన్నారు. చాలా మందికి ఉక్రెయిన్‌ బయట ఉన్న ప్రత్యామ్నాయ ఎయిర్‌పోర్టులకు వాహనాలు దొరకడం లేదు. కనీసం నిత్యావసరాలు కూడా నిల్వ చేసుకోకపోవడంతో వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

Read Also…

Russia Ukraine Crisis: నేను కీవ్ లోనే ఉన్నాను.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు..