NRI News: వాషింగ్టన్ డీసీలో(Washington DC) జూలై 1 నుండి జూలై 3 వరకు జరగనున్న ఆటా(ATA) కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా.. 17వ ఆటా కన్వెన్షన్ టీమ్ మే 14 తేదీన వర్జీనియాలో(Virginia) “టేబుల్ టెన్నిస్” పోటీలు (Table Tennis Tournament) నిర్వహించారు. ఈ పోటీల్లోవివిధ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు చురుగ్గా పాల్గొన్నారు. మే 14న హెండన్ సిటి లోని కాసెల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చాలా ఉత్సాహభరితంగా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరు కాగా 120 మంది పోటీల్లో పాల్గొన్నారు.
విజేతల వివరాలు: మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో సుష్మిత-కుసుమ డబుల్స్‌లో గెలుపొందగా, అజిత-స్వాతి ద్వితీయ స్థానంలో నిలిచారు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మాధురి బుజలెమ్మ గెలుచుకోగా, సుస్మిత రన్నరప్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో డివిజన్ 1 విజేత శరత్, రన్నరప్ రామకృష్ణ. డివిజన్ 2 విజేత వివేక్, 2వ స్థానం కిషోర్. విక్రమ్, చంద్ర డబుల్స్ టైటిల్స్ గెలుపొందగా, కిషోర్, మురళి రన్నరప్‌లుగా నిలిచారు. మిక్స్‌డ్ డబుల్ విభాగంలో అజిత, వివేక్ అజిత, వివేక్ టైటిల్ గెలుచుకోగా, శ్రుతి, చంద్ర 2వ స్థానంలో నిలిచారు. సుధీర్ కోడం, జట విష్నుబొట్ల “టేబుల్ టెన్నిస్” పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ విజయవంతంగా నిర్వహించారు.
బహుమతి ప్రధానం: క్యాపిటల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ వడ్డి, శ్రవణ్ పాడురు, మీడియా కమిటీ చైర్ రాము ముండ్రాతి, కో చైర్ సునీల్ కుడికల, హాస్పిటలిటి కమిటీ చైర్ అమర్ పాశ్య , కో చైర్ , వాలంటీర్ కమిటీ చైర్ లోహిత్,సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ టీమ్ విజేతలను అభినందించి బహుమతులు అందించారు.
ఆటా 17వ మహాసభ ఏర్పాట్లు: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , “Daaji” కమలేష్ పటేల్ , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు బాలకృష్ణ, వెటరన్ క్రికెటర్స్ కపిల్ దేవ్, గవాస్కర్, టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ , డీజే సిద్దు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, బిగ్ బాస్ విన్నర్ VJ సన్ని లతో పాటు సింగర్ మంగ్లీ కూడా పాల్గొననున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త GMR గ్రూప్అధినేత గ్రంధి మల్లికార్జున రావు, ఉపాసన కొణిదెల, డాక్టర్ ఎమ్మెస్ఎన్ రెడ్డి వంటి అనేక మంది ఆటా మాహాసభకు హాజరుకానున్నారు. ఈ వేడుక వాషింగ్టన్ డీసీ నగరం నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో Walter E. Washington Convention Center లో జరగనున్నది. ఈ వేడుకల్లో వివిధ కార్యక్రమాలతో పాటు 200 పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ మూడు రోజులు వరుసగా జూలై 1 నుంచి 3 వరకు ఈ వేడుకల్లో పలువురు తమ సంగీతంతో వీనుల విందు చేయబోతున్నారు. “మొదటి రోజు” గాయకుడు రాం మిరియాల అండ్ బ్యాండ్, “రెండవ రోజు” ఎస్ఎస్ థమన్, “మూడవ రోజు” ప్రముఖ సంగీత దర్శకుడు “పద్మవిభూషణ్” ఇళయరాజా సంగీత విభావరిని ఆటా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్నిగ్లోబల్ ఇండియన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..