Ghost Village: ఆ రిజర్వాయర్‌కు కరువు.. 30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ గ్రామం.. భారీగా సందర్శకులు

|

Feb 20, 2022 | 3:06 PM

Ghost Village: ప్రకృతిలో మార్పుల్లో భాగంగా అనేక గ్రామాలు కనుమరుగైపోతున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రకృతిలో వచ్చిన మార్పులతో కనుమరుగైపోయింది గ్రామాలు మళ్ళీ కనుల...

Ghost Village: ఆ రిజర్వాయర్‌కు కరువు.. 30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ గ్రామం.. భారీగా సందర్శకులు
Ghost Village
Follow us on

Ghost Village: ప్రకృతిలో మార్పుల్లో భాగంగా అనేక గ్రామాలు కనుమరుగైపోతున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రకృతిలో వచ్చిన మార్పులతో కనుమరుగైపోయింది గ్రామాలు మళ్ళీ కనుల ముందుకు వస్తున్నాయి. తాజాగా యూరోపియన్(Europe ) దేశమైన స్పెయిన్‌(Spain)లోని ఒక గ్రామం 30 ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణ సమయంలో నీటి అడుగున మునిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో కరువు తాండవిస్తూ.. నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. రిజర్వాయర్ లోని నీరు మొత్తం అడుగు అంటుంది. దీంతో 30 సంవత్సరాల క్రితం డ్యామ్‌లో మునిగిపోయిన ఘోస్ట్ గ్రామం మళ్ళీ కనిపిస్తుంది.

స్పానిష్ లోని అసెరెడో అనే ఘోస్ట్ గ్రామం 1992 నుండి రిజర్వాయర్ నీటి అడుగున ఉండిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ గ్రామం వెలుగులోకి రావడం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. పాత భవనాలు శిథిలావస్థలో కనిపించడంతో స్థానికులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ గ్రామానికి చెందిన వృద్ధుడు మాక్సిమినో పెరెజ్ రొమెరో ది సన్‌తో మాట్లాడుతూ.. తాను మళ్ళీ తమ గ్రామాన్ని చూడడం అద్భుతంగా భావిస్తున్నాని.. ఇది సినిమాలో జరిగిన సంఘటనగా భావిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు తనకు చాలా బాధగా ఉందని.. వాతావరణ మార్పులతో కరువుకాటకాలు ఏర్పడి.. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆల్టో లిండోసో రిజర్వాయర్‌ నిర్మాణం సమయంలో 1992లో అసెరెడోలో భారీగా వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఈ గ్రామం రిజర్వాయర్ అడుగుకి చేరుకుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న పొడి వాతావరణం కారణంగా స్పానిష్-పోర్చుగీస్ సరిహద్దులోని ఈ ఆనకట్టలో నీరు దాదాపుగా ఖాళీ అయింది. దీంతో శిథిలాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌ సామర్థ్యం 15 శాతం మాత్రమే ఉంది.

శిథిలాలను చూడడానికి ఈ ప్రాంతాన్ని భారీ సంఖ్యలోకి సందర్శకులు చేరుకుంటున్నారు. అక్కడ కూలిపోయిన పైకప్పులు, ఇటుకలు, చెక్క శిధిలాలను చూసి ఒకప్పుడు ఆ గ్రామం ప్రజలు మంచి స్టేజ్ లో బతికినట్లు భావిస్తున్నారు. ఇక ఈ ఘోస్ట్ టౌన్లోని ఒక కేఫ్‌లో పేర్చబడిన అనేక ఖాళీ బీర్ బాటిళ్ల డబ్బాలు కూడా ఉన్నాయి. అంతేకాదు పాక్షికంగా ధ్వంసమైన పాత కారు, తుప్పు పట్టిన రాతి గోడ ఇవన్నీ అలంటి గ్రామ వైభవాన్ని తెలియజేస్తున్నాయి.

ఈ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తి మాట్లాడుతూ.. ఒకప్పుడు “ఈ ప్రదేశమంతా ద్రాక్షతోటలు, నారింజ చెట్లు ఉండేవని.. గ్రామం పచ్చగా ఉండేదని చెప్పాడు. 1992కి ముందు తన స్నేహితులతో కలిసి బార్‌కి వెళ్లేవాడినని తెలిపాడు. ఇంతటి విపరీతమైన కరువులకు కారణం వాతావరణ మార్పులే అని నిపుణులు చెబుతున్నారు.

Also Read:

టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సర్కార్.. ప్రేక్షకులకు, చిత్రపరిశ్రమకు ఆమోదయోగ్యంగా నిర్ణయం!