ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం భిన్నంగా ఉంటాయి. కట్టు, బొట్టు, విందు, వేడుకలు ఇలా అన్నీ భిన్నమే.. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది భారతీయ హిందూ కుటుంబ వ్యవస్థ. వివాహ వేడుక. రెండు కుటుంబాల నుంచి యువతీయువకులు పెళ్లి అనే పవిత్ర వేడుకతో ఒకటి అవుతారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషలతో జీవిస్తారు. అయితే ఈ పెళ్లి సంప్రదాయానికి ఇతర దేశాలకు చెందిన యువత కూడా ఆకర్షింపబడుతోంది. అదే సమయంలో కొన్ని దేశాల్లోని యువత బాధ్యతలను తీసుకోవడానికి ఇష్ట పడడం లేదు. దీంతో ప్రేమ, సహజీవనం వద్దు స్నేహ పెళ్లి ముద్దు అని అంటున్నారు.
జపాన్‌కి చెందిన యువత కొత్త తరహా మ్యారేజ్ ట్రెండ్‌ని అవలంబిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో జంటల మధ్య ప్రేమ లేదా ఇతర సంబంధాలు ఉండవు. తాము ఇష్టపడిన యువతీ యువకులు, స్వలింగ సంపర్కులు ఇలా ఎవరైనా ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ చేసుకోవాలి. ఈ వివాహ వేడుక్కి స్నేహ వివాహం అని పేరు పెట్టారు. ఇటువంటి వివాహాలను చేసుకున్న వ్యక్తులు వివాహంపై విశ్వాసం కోల్పోరు. లేదా ప్రేమలో పడలేరు. నివేదిక ప్రకారం, 2015 నుంచి సుమారు 500 మంది స్నేహ వివాహాన్ని స్వీకరించారు. అలా పెళ్లి చేసుకున్న వ్యక్తులు తమ భాగస్వాములతో కాలక్షేపం చేయవచ్చు. తమ సమస్యలను పంచుకోవచ్చు .. కలిసి ఏదైనా ఇతర కార్యకలాపంలో పాల్గొనవచ్చు. జంటలు వారి అభిరుచులు, విలువల ఆధారంగా ఈ వివాహం చేసుకుంటారు.
వాస్తవానికి స్నేహ వివాహంలో భాగస్వాములు చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి శృంగార సంబంధం ఉండదు. ఈ వివాహంలో ఇద్దరూ కలిసి జీవిస్తారు లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే వివాహం తర్వాత కూడా విడిగా జీవించవచ్చు. అంతేకాదు ఇద్దరూ సమ్మతితో బిడ్డను కనాలని అనుకున్నట్లయితే, వారు కృత్రిమ మార్గాల ద్వారా బిడ్డను కనవచ్చు. ఈ వివాహంలో విచిత్రమైన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఇలా వివాహం చేసుకున్న తర్వాత కూడా జంటలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో శృంగార సంబంధాలు కలిగి ఉంటారు. అది కూడా ఇద్దరి సమ్మతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకోవడం లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడం లాంటిది కాదని.. మీ రూమ్మేట్ని వెతుక్కోవడం లాంటిదని ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి చెప్పాడు.
పెళ్లికి ముందు జంటలు గంటల తరబడి కలిసి గడిపి తమ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటారు. అంతే కాకుండా కలిసి భోజనం చేయాలా, ఇంటి ఖర్చులు ఎలా పంచుకోవాలి, ఇతర ఇంటి పనులను ఎలా విభజించుకోవాలి, ఇతర విషయాలపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. జపాన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం 32 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఈ స్నేహ వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు. జపాన్‌తో పాటు సింగపూర్‌లో కూడా కొంతకాలం క్రితం ఇద్దరు 24 ఏళ్ల యువతులు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకోవడంతో పాటు తమ క్లోజ్‌ఫ్రెండ్‌తో కలిసి చైనాలో ఇల్లు కొనాలనుకునే వారు చాలా మంది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ను చేసుకుంటున్నారు. ఈ స్నేహ వివాహం యువతీయువకులను ఆకర్షింపబడుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..