explosions hit equatorial guinea : ఈక్వటోరియల్ గినియా దేశంలోని బాటాలో భారీ పేలుళ్లు సంభవించి 17 మందికి పైగా మృతి చెందారు. ఈ పేలుడులో వందలాది మందికి పైగా గాయపడ్డారు. బాటాలోని సైనిక స్థావరం వద్ద జరిగిన శక్తివంతమైన పేలుళ్లు జరిగినట్ల ఆదేశ మీడియా తెలిపింది. సైనిక స్థావరం వద్ద డైనమైట్ వాడకానికి సంబంధించిన నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పేలుళ్లు సంభవించాయని జాతీయ టెలివిజన్‌లో అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్ తెలిపారు. ఈ పేలుళ్ల దాటికి 17 మంది చనిపోయినట్లు నిర్ధారించామని, గాయపడిన వారి సంఖ్య 420 గా ఉందని ఆయన ప్రకటించారు. ఈ పేలుళ్ల దాటి బాటాలో విధ్వంసంగా మారిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుందనే భయాలు ఉన్నాయి.
పేలుడు ప్రాంతంలోని సమీప ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డవారిలో పిల్లలు, మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాదితుల అర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అహకారాలతో నిండిపోయింది. ఈక్వటోరియల్ గినియా దేశం 1.4 మిలియన్ల జనాభా కలిగిన చిన్న దేశం. చమురు నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ పేదరికంలో జీవిస్తోంది. వైస్ ప్రెసిడెంట్ ఒబియాంగ్ కుమారుడు టియోడోరో న్గుమా ఒబియాంగ్ మాంగ్యూ టెలివిజన్ ఫుటేజీలో తన ఇజ్రాయెల్ అంగరక్షకులతో కలిసి పేలుడు జరిగిన ప్రాంతంలో పర్యటించారు. జరిగిన నష్టాన్ని అంచానా చేస్తున్నట్లు తెలిపారు.