అమెరికాలో హత్య కేసు.. భారత మాజీ అథ్లెట్ అరెస్ట్‌

| Edited By:

Aug 26, 2020 | 8:17 PM

అమెరికాలో జరిగిన హత్య కేసులో భారతదేశానికి చెందిన మాజీ అథ్లెట్ ఇక్బాల్ సింగ్‌(62)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అమెరికాలో హత్య కేసు.. భారత మాజీ అథ్లెట్ అరెస్ట్‌
Follow us on

Former Indian Athlete arrest: అమెరికాలో జరిగిన హత్య కేసులో భారతదేశానికి చెందిన మాజీ అథ్లెట్ ఇక్బాల్ సింగ్‌(62)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో తన భార్య, తల్లిని హత్య చేసినట్లు ఇక్బాల్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.

కాగా ఇక్బాల్, డెల్వార్‌ కౌంటీలో నివాసం ఉంటుండగా., అతడి ఇంట్లో హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు ఇక్బాల్‌ ఇంటికి వెళ్లే సరికి అక్కడ రెండు మృతదేహాలు ఉండగా.. అతడి శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. ఇక్బాల్‌కి అయిన గాయాలు సొంతంగా చేసుకున్నవే అని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్రూరంగా హత్య చేయడం అన్న అభియోగంపై ఇక్బాల్‌పై కేసు నమోదు చేశారు. అతడికి బెయిల్‌ వచ్చే అవకాశం కూడా లేనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వారిద్దరిని హత్య చేసిన తరువాత.. ఇక్బాల్‌, తన కుమారుడికి ఫోన్ చేసి.. మీ అమ్మ, నానమ్మను హత్య చేశాను. పోలీసులకు ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పు అని తెలిపినట్లు సమాచారం. కాగా 1983లో కువైట్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో షాట్‌పుట్ విభాగంలో భారత్ తరఫున ఇక్బాల్ కాంస్య పతకం సాధించారు.

Read More:

నాలుగు రోజుల షూటింగ్ తరువాత తీసేశారు.. రాత్రంతా ఏడ్చేదాన్ని

బంపరాఫర్లు పెట్టిన యజమాని.. షాప్‌ ఓపెనింగ్ రోజే సీజ్‌