Guidelines For Passengers: యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. తాజాగా మార్గదర్శకాలు జారీ

|

Jan 02, 2021 | 7:06 PM

Guidelines For Passengers: యూకే నుంచి భారత్‌ కు వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జనవరి 8 నుంచి 30 మధ్య ఆ దేశం నుంచి వచ్చే...

Guidelines For Passengers: యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. తాజాగా మార్గదర్శకాలు జారీ
Follow us on

Guidelines For Passengers: యూకే నుంచి భారత్‌ కు వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జనవరి 8 నుంచి 30 మధ్య ఆ దేశం నుంచి వచ్చే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే పరీక్షలకు అయ్యే ఖర్చు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను శనివారం జారీ చేసింది కేంద్రం.

ఇదిలా ఉంటే.. బ్రిటన్‌ నుంచి విమాన రాకపోకలపై కేంద్రం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కాగా, యూకేలో కొత్త స్ట్రైయిన్‌ వైరస్‌ బయటపడటంతో గత ఏడాది డిసెంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 31 వరకు కేంద్రం ఆ దేశం నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. తర్వాత ఆ ఆంక్షలను జనవరి 7వ తేదీ వరకు పొడిగించింది.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం..

  • యూకే నుంచి బయలుదేరడానికి 72 గంటల ముందు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌తో ఉన్న రిపోర్టు తప్పనిసరి.
  • ప్రయాణికుడిని విమానంలోకి అనుమతించే ముందు విమానయాన సంస్థలు రిపోర్టులను సైతం క్షుణ్ణంగా పరిశీలించాలి.
  • ఆర్టీపీసీఆర్‌ పరీక్ష లేక, రిపోర్టు కోసం ఎదురు చూసే వారికి విమానాశ్రయంలో సరైన సదుపాయాలు కల్పించాలి.
  • పాజిటివ్‌ తేలిన వారికి ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచాలి. అలాగే నెగిటివ్‌గా నిర్ధారించుకోవడానికి మరో 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.
  • ఎయిర్‌ పోర్టులో నెగిటివ్‌ తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో తప్పకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

Also Read: India-UK Flights: భారత్ ‌- యూకే విమానాలపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. కేవలం ఈ ఎయిర్‌ పోర్ట్‌ల నుంచే అవకాశం.