ఆ బ్రిటన్ వైరస్ ‘జాడ తెలిసింది’, దాన్ని సక్సెస్ ఫుల్ గా ఐసొలేట్ చేసిన ఘనత మనదే ! ఐసీఎంఆర్ వెల్లడి, మరిన్ని పరిశోధనలు కూడా

కోవిడ్ 19 కి మూలమైన సార్స్ -కొవ్-2 ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ సీ ఎం ఆర్) ని ట్రాక్ చేసి విజయవంతంగా ఐసొలేట్ చేయగలిగింది.

ఆ బ్రిటన్ వైరస్ 'జాడ తెలిసింది', దాన్ని సక్సెస్ ఫుల్ గా ఐసొలేట్ చేసిన ఘనత మనదే !  ఐసీఎంఆర్ వెల్లడి, మరిన్ని పరిశోధనలు కూడా
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jan 02, 2021 | 7:52 PM

కోవిడ్ 19 కి మూలమైన సార్స్ -కొవ్-2 ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ సీ ఎం ఆర్) ని ట్రాక్ చేసి విజయవంతంగా ఐసొలేట్ చేయగలిగింది. ఇండియాలో ఈ ఎపిడమిక్ ప్రారంభమైన తొలినాళ్ళ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బ్రిటన్  లో తలెత్తిన మ్యుటెంట్ స్ట్రెయిన్ అనేక మార్పులకు లోనయిందని గుర్తించారు. ఆ దేశం నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన వారి నుంచి నమూనాలను సేకరించి పూణే లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీలో విశ్లేషించారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఏ దేశం కూడా ఇప్పటివరకు  ఇలా దీన్ని ఐసొలేట్ చేయలేకపోయిందని ఈ సంస్థ పేర్కొంది.  ఐ సీ ఎం ఆర్ కు, ఈ వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కు చెందిన రీసెర్చర్లు యూకే స్ట్రెయిన్ ని విశ్లేషించడానికి వీరో సెల్ లైన్స్ ని వినియోగించారు.

తమ దేశ జనాభాలో ఈ వైరస్ 70 శాతం వేగంగా సంక్రమించిందన్న విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో ఇండియా వెంటనే ఎలర్ట్ అయింది. దీని మూలాలు కనుగొనేందుకు ప్రో-యాక్టివ్, ప్రివెంటివ్ స్ట్రాటజీని ఐ సీ ఎం ఆర్ వినియోగించింది. డెన్మార్క్,  నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్డర్లాండ్, జర్మనీ తదితర దేశాల్లో ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ జాడ అప్పుడే కనిపించింది.

నవంబరు 25 నుంచి డిసెంబరు 23 అర్ధరాత్రి వరకు యూకే నుంచి ఇండియాలోని వివిధ విమానాశ్రయాలకు చేరుకున్న 33 వేల మంది ప్రయాణికులకు అన్ని ఆర్ టీ , పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. గత 38 రోజుల్లో యూకే నుంచి వచ్చిన ప్రయాణికులతో బాటు వారి కుటుంబాలు, ఇతరుల కాంటాక్ట్ ట్రేసింగ్ ని ముమ్మరంగా చేపట్టారు.