Monkeypox: మంకీపాక్స్‌పై ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తల హెచ్చరిక.. వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం

Monkeypox: ఒక వైపు కరోనాతో ఇబ్బందులు పడి కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త కొత్త వైరల్‌లు వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి..

Monkeypox: మంకీపాక్స్‌పై ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తల హెచ్చరిక.. వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం
Follow us

|

Updated on: May 31, 2022 | 4:33 PM

Monkeypox: ఒక వైపు కరోనాతో ఇబ్బందులు పడి కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త కొత్త వైరల్‌లు వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. కౌన్సిల్, చిన్న పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. దీని కారణంగా దాని లక్షణాలను పర్యవేక్షించవలసి ఉంటుంది. ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. 21 దేశాల నుండి 226 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితే భారతదేశంలో ఇంకా అలాంటి కేసులు లేవు. ఇన్ఫెక్షన్ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది.

చిన్న పిల్లలే కాదు.. మశూచి వ్యాక్సిన్ తీసుకోని ప్రతి ఒక్కరికీ కోతుల నుంచి వచ్చే వైరస్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఈశ్వర్‌ గిలాడా తెలిపారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ICMR శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ మాట్లాడుతూ.. పిల్లలు మంకీపాక్స్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

లాన్సెట్ అధ్యయనం ప్రకారం.. నైజీరియాలో 2017లో వైరస్ సోకిన వ్యక్తుల సగటు వయస్సు 29 సంవత్సరాలు. మశూచి వ్యాక్సిన్‌ను నివారణ, చికిత్స చర్యలుగా కూడా ఉపయోగించవచ్చని డాక్టర్ గిలాడా వివరించారు. భారతదేశం 1979లో మశూచి నుండి విముక్తి పొందిందని ప్రకటించుకుంది. అయితే మశూచి వ్యాక్సిన్ కాకుండా ST-246, Cidofovir, CMX-001 వంటి మూడు యాంటీవైరల్ సమ్మేళనాలు మంకీపాక్స్ చికిత్సకు ఉపయోగించవచ్చని అంచనాలున్నాయని ఆయన తెలిపారు. ఈ యాంటీవైరల్‌లు USలో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రజలు ఆందోళన చెందవద్దు..

ICMR శాస్త్రవేత్త, డాక్టర్ ముఖర్జీ మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, ఈ వ్యాధి గురించి ప్రజలు భయాందోళన చెందకూడదు సూచించారు. ఈ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి దగ్గర సంబంధం ఉన్నప్పుడే వ్యాపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే ICMR-NIV నుండి విడుదలయ్యాయని ICMR అధికారి పేర్కొన్నారు. ఈ మంకీపాక్స్‌ను ఎదుర్కొవడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలలో ఐసోలేషన్, కాంటాక్ట్ ట్రేసింగ్, కాంటాక్ట్ మానిటరింగ్, నివారణ చర్యలు, రిస్క్ అసెస్‌మెంట్ వంటి నిర్వహణ సూత్రాలు ఉంటాయి.

మంకీపాక్స్‌ లక్షణాలు:

శరీరంలో నొప్పులు శరీరంపై దద్దుర్లు తీవ్రమైన జ్వరం శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం

మంకీపాక్స్ కేసులను సులభంగా అరికట్టడానికి దేశాలు సరైన చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్ నిల్వల గురించి సమాచారాన్ని పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి తెలిపారు. వ్యాధి ఏ స్థాయిలో ఉందో మాకు తెలియదు.. మనం దీన్ని సులభంగా అరికట్టగలమని మేము భావిస్తున్నాము అని అన్నారు. అందుకే మేము ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము అని అన్నారు.

20కిపైగా దేశాల్లో కేసులు..

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీపాక్స్‌ కేసులు.. ఒక్కో దేశానికి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా మెక్సికో, ఐర్లాండ్‌ దేశాల్లోనూ తొలి కేసులు నమోదు అయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్‌ గుర్తించినట్లు మెక్సికో వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఐర్లాండ్‌లో మంకీపాక్స్ తొలి కేసును ధ్రువీకరించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లక్షణాలున్న మరో వ్యక్తిని కూడా పరీక్షిస్తున్నట్లు హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ మంకీపాక్స్‌ వైరస్‌ అనేది తీవ్రమైనదిగా గుర్తించారు నిపుణులు. దీని తీవ్రత వల్ల అనారోగ్యం, సాధారణ ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే కణువుల వాపుతో మొదలై ముఖం, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీని ఇన్ఫెక్షన్‌ 2 నుంచి 4 వారాల వరకు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల, లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఇది వ్యాధి వ్యాప్తి చెందుతుందని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ బిందువుల ద్వారా సంక్రమించవచ్చు. కలుషితమైన బట్టలు, దీర్ఘకాలం పాటు శ్వాసకోశ బిందువుల ద్వారా సంక్రమించే అవకాశం ఉందంటున్నారు.

ఈ వైరస్‌ సోకితే లక్షణాలు ఏమిటి?

కాగా, ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో పలు రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. మంకీపాక్స్ సోకితే తరచూ జ్వరం, కండరాలనొప్పి, ఫ్లూ లాంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడతారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. వ్యాధి బారినపడ్డ వారి ఉపయోగించిన వస్తువులను వాడినా వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనికి చికెన్ పాక్స్ లక్షణాలే ఉంటాయని తెలిపారు.

చివరి సారిగా 2003లో..

కాగా, చివరి సారిగా 2003లో అమెరికాలో ఈ మంకీ పాక్స్‌ కేసులు బయట పడ్డాయి. అప్పట్లో 47 మందికి ఈ వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. మిడ్‌వెస్ట్‌ ప్రాంతంలోని పెంపుడు కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మంకీ పాక్స్ కేసు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. 100లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..