ఈజిప్టులో భద్రతాబలగాల కాల్పులు…14 మంది ఉగ్రవాదుల హతం

ఈజిప్టులో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆరిష్ నగరంలోని ఓ శిథిలావస్థలో ఉన్న భవనంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టి.. కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దేశంలోని నార్త్ సినాయ్ ప్రావిన్సులో.. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో 8మంది పోలీసులు మరణించారు. పోలీసులను హతమార్చిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. దక్షిణ ఆరిష్ చెక్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. చెక్ పోస్టు […]

ఈజిప్టులో భద్రతాబలగాల కాల్పులు...14 మంది ఉగ్రవాదుల హతం
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 07, 2019 | 1:47 PM

ఈజిప్టులో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆరిష్ నగరంలోని ఓ శిథిలావస్థలో ఉన్న భవనంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టి.. కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

దేశంలోని నార్త్ సినాయ్ ప్రావిన్సులో.. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో 8మంది పోలీసులు మరణించారు. పోలీసులను హతమార్చిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. దక్షిణ ఆరిష్ చెక్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. చెక్ పోస్టు వద్ద కాల్పులు తామే జరిపామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఈ రెండు ఘటనలు ఈజిప్టు దేశంలో సంచలనం రేపాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu