Viral Video: విషంగా మారిన నది నీళ్లు.. టన్నుల కొద్ది చేపలు మృత్యువాత.. షాకింగ్ వీడియో..

Viral Video: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన చేపలు చనిపోయినట్లు ఒడ్డుకు కొట్టుకురావడంతో ఆ ప్రాంతమంతా చనిపోయిన చేపలతో నిండిపోయింది...

Viral Video: విషంగా మారిన నది నీళ్లు.. టన్నుల కొద్ది చేపలు మృత్యువాత.. షాకింగ్ వీడియో..

Updated on: Aug 13, 2022 | 3:12 PM

Viral Video: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన చేపలు చనిపోయినట్లు ఒడ్డుకు కొట్టుకురావడంతో ఆ ప్రాంతమంతా చనిపోయిన చేపలతో నిండిపోయింది. పోలాండ్, జర్మనీ సరిహద్దులో ఉన్న ఓడర్‌ నదిలో చోటు చేసుకున్న ఈ సంఘటన షాకింగ్‌కు గురి చేసింది. జూలై నెల నుంచి చేపలు ఇలా అకారణంగా మృత్యువాతపడుతున్నాయి. చేపలు చనిపోవడానికి నీటిలోని విష పదార్థాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

చేపలు మృత్యువాత పడడానికి కారణమేంటన్న దానిపై నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మనుషులు ఎవరూ నదిలోకి వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే నదికి సమీపంలో ఉన్న కొన్ని ఫ్యాక్టరీల నుంచి వెలువడుతోన్న మెర్కూరీని నదిలోకి డంప్‌ చేయడం ద్వారానే ఇలా జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లు ఆ నది నుంచి మృత్యువాత పడ్డ 10 టన్నుల చేపలను వెలికి తీశారు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఈ నదిలోని నీరు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొన్నేళ్లు పడుతుందని పోలండ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ తెలిపారు. ఇక పోలాండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్ అధికారులపై పోలిష్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ విరుచుకుపడ్డారు. పరిస్థితి చేయి దాటడానికి వారి ఉదాసినతే కారణమని విమర్శించారు. ఇదిలా ఉంటే నదిలోని నీటి నమూనాలలో పాదరసం అధిక స్థాయిలో ఉన్నట్లు తేలింది. జర్మనీ, పోలాండ్‌ దేశాల మధ్య ఉన్న నదిలో ఈ పరిస్థితి చోటు చేసుకోవడం ఇప్పుడు రెండు దేశాల మధ్య వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..