Cat Rescue: మానవత్వం పరిమళించినవేళ.. పిల్లిని పట్టారు.. రాజుగారి ప్రశంసలతో పాటు.. పదిలక్షల రివార్డును అందుకున్నారు

|

Aug 29, 2021 | 10:30 AM

Cat Rescue: అదృష్టవంతుడిని పాడుచేసేవారు లేరు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవారు లేరు అని పెద్దల మాట. అవును అదృష్టదేవత ఎవరిని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవరికీ తెలియదు.. అదృష్ట దేవత ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో..

Cat Rescue: మానవత్వం పరిమళించినవేళ.. పిల్లిని పట్టారు.. రాజుగారి ప్రశంసలతో పాటు.. పదిలక్షల రివార్డును అందుకున్నారు
Cat Rescue
Follow us on

Cat Rescue: అదృష్టవంతుడిని పాడుచేసేవారు లేరు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవారు లేరు అని పెద్దల మాట. అవును అదృష్టదేవత ఎవరిని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవరికీ తెలియదు.. అదృష్ట దేవత ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో పలకరిస్తూ ఉంటుంది. కొందరికి లాటరీ రూపంలో వస్తే, మరికొందరికి మరో రూపంలో అదృష్టం వరిస్తుంది. వీరికి మాత్రం పిల్లి రూపంలో అదృష్టం వచ్చింది. ఆ పిల్లే వారికి 10 లక్షల రివార్డు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే..

గర్భంతో ఉన్న ఓ పిల్లి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోతుండగా ఓ నలుగురు వ్యక్తులు దాన్ని రక్షించారు. ఈ ఘటన దుబాయ్ లో జరిగింది. పిల్లిని కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏకంగా దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బీప్ రషీద్ ఈ వీడియో చూశారు.. వెంటనే రాజు రషీద్ స్పందిస్తూ.. గర్భంతో ఉన్న పిల్లి ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురిని మెచ్చుకుంటూ 10 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. పిల్లిని కాపాడిన ముగ్గురిలో ఒకరు కేరళ వాసి అష్రఫ్ కూడా ఉన్నారు. అష్రఫ్ అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.

రెండో ఫ్లోర్ నుంచి ఓ పిల్లి కింద పడుతుండటం నలుగురు వ్యక్తులు గమనించారు. వెంటనే ఓ బెడ్ షీట్ పట్టుకొని.. నిలబడ్డారు. ఆ పిల్లికి పట్టు దొరకక.. రెండో ఫ్లోర్ బాల్కనీ నుంచి కింద పడబోతుండగా.. బెడ్ షీట్‌ను అడ్డంగా పెట్టారు. దీంతో ఆ పిల్లి బెడ్ షీట్‌లో పడి ప్రాణాలు దక్కించుకుంది. ఆ పిల్లి గర్భంతో ఉంది. దాన్ని కాపాడిన వారిని స్థానికులు మెచ్చుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ నలుగురిలో ముగ్గురు ఒకరికొకరు అస్సలు పరిచయమే లేదు. పిల్లిని కాపాడే క్రమంలో వారు అప్పుడే ఆ నలుగురూ ముందుకు వచ్చారు. మానవత్వాన్ని చూపించారు.

 

Also Read:   కృష్ణాష్టమిరోజున కన్నయ్యకు ఇష్టమైన పదార్ధాలతో నైవేద్య పెట్టండి.. కృపకు పాత్రులుకండి