యుద్ధం ఆపేస్తున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. అసలు కారణం ఏంటంటే..?

ఇరాన్‌తో యుద్ధం పతాక స్థాయికి చేరిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇచ్చారు. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి లభించడంతో దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. వచ్చే 5 రోజుల పాటు ఎటువంటి దాడులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.

యుద్ధం ఆపేస్తున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. అసలు కారణం ఏంటంటే..?
Donald Trump Suspends Iran Strikes

Updated on: Mar 23, 2026 | 5:09 PM

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గత మూడు వారాలుగా ఇరాన్‌పై కొనసాగుతున్న భీకర దాడులకు 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అంతర్గతంగా నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ ధృవీకరించారు. ‘‘మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ అది శక్తివంతమైన శాంతి అయి ఉండాలి. ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయి, అందుకే రాబోయే ఐదు రోజుల పాటు ఎటువంటి దాడులు చేయవద్దని మా దళాలను ఆదేశించాను’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

వ్యూహాత్మక అడుగు..

ఈ 5 రోజుల గడువులోగా ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే.. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను అంతర్జాతీయ నౌకల కోసం పూర్తిగా తెరవకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. తాజా విరామం ఇరాన్‌కు ఒక చివరి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో ఊరట.. భారత్ స్పందన

యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు కొంత ఊరటనిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఉద్రిక్తతలపై లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సంక్షోభం త్వరగా ముగియాలని కోరారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత దృష్ట్యా ఈ యుద్ధ విరామం అత్యంత కీలకంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us