
Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న డొనాల్డ్ ట్రంప్ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంటున్నారు.. అమెరికా అధ్యక్షుని వ్యవహరించిన సమయంలో ఆయన చేసిన నిర్వాకాలు క్రమంగా బయటపడుతున్నాయి. క్యాపిటల్ హిల్స్‌పై దాడి కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ట్రంప్‌పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ -ఎఫ్‌బీఐ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఇటీవల ఎఫ్‌బీఐ అధికారులు ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో భవనంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆ ఇంటిలో దేశానికి చెందిన కీలక పత్రాలు దొరికాయి. ఇవన్నీ అక్కడి వార్తా పత్రికలు, మ్యాగజైన్లలో దాచి పెట్టారని ఎఫ్‌బీఐ తన అఫిడవిట్‌లో తెలిపింది. 15 బాక్సుల్లో ఈ పత్రాలు దొరికాయి. ఇందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పత్రాలన్నీ ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఇక్కడికి తరలించాని భావిస్తున్నారు. కాగా ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేసే సమయంలో హడావుడిగా తీసుకొచ్చిన పత్రాల్లో ఇవన్నీ ఉన్నాయని ఆయన కొడుకు చెబుతున్నాయి. ఈ పత్రాలను ట్రంప్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉన్నా, ఎందుకు ఇవ్వలేదని ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ఫ్లోరిడాలోని తన నివాసంపై ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేపట్టినప్పుడు బైడెన్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్.. వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేయకుండా అడ్డుకునేందుకే డెమోక్రాట్లు ఈ కుట్రలు పన్నారని ఆరోపించారు. ఇదంతా రాజకీయ కక్షసాధింపని ఆరోపించారు. గతంతో ఏ మాజీ అధ్యక్షుని నివాసంతో తనిఖీలు జరగలేదని, తన ఇంటిలో జరపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు ట్రంప్.. అమెరికాలో మిట్‌టర్మ్ ఎన్నికల సమయంలో ఈ తనిఖీలు రాజకీయాంశంగా మారిపోయాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం