Donald Trump: భారత్ – పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా: డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత.. తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్‌-పాక్ మధ్య అణు వివాదానికి బ్రేక్ వేశా అంటూ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలి.. దాడులు విరమించాలని.. ఒత్తిడి తెచ్చా అంటూ ట్రంప్‌ తెలిపారు.

Donald Trump: భారత్ - పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా: డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Donald Trump

Updated on: May 12, 2025 | 9:23 PM

పహల్గామ్‌ ఉగ్రదాడికి భారత్‌.. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది.. పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది.. దాదాపు 100 మంది ముష్కరులు హతమయ్యారు.. ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టమయ్యాయి.. అయితే.. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ మొదలుపెట్టినప్పటీ నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు ఓకే చెప్పేవరకూ బోర్డర్‌ దద్దరిల్లింది. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. భారత్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది.. అయితే.. కాల్పుల విరమణ ప్రకటనకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటనలు కూడా వెలువడ్డాయి..

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత.. తాజాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్‌-పాక్ మధ్య అణు వివాదానికి బ్రేక్ వేశా అంటూ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలి.. దాడులు విరమించాలని.. ఒత్తిడి తెచ్చా అంటూ ట్రంప్‌ తెలిపారు. రెండు దేశాలు ఘర్షణలు ఆపకపోతే.. అమెరికాతో వాణిజ్య సంబంధాలుండవని హెచ్చరించానన్నారు. యుద్ధ వాతావరణం నాటి నుంచి భారత్ పాకిస్తాన్ తో నిరంతరం సంప్రదింపులు జరిపామని ట్రంప్ తెలిపారు.

భారత్, పాకిస్తాన్ లతో వాణిజ్యపరమైన సంబంధాలు మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుగతున్నాయని.. పాకిస్తాన్‌తో త్వరలో చర్చలు జరుపుతామని చెప్పారు. ఇరు దేశాలు తమ మాట విన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మే 10న భారతదేశం – పాకిస్తాన్ మధ్య జరిగిన అవగాహనను మధ్యవర్తిత్వం చేయడానికి తన పరిపాలన సహాయపడిందని అమెరికా అధ్యక్షుడు వివరించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇది శాశ్వత కాల్పుల విరమణగా భావిస్తున్నానని తెలిపారు.

శాంతి ప్రక్రియను సులభతరం చేయడంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చయండి..