షాకింగ్.. కుక్క పిల్లలకు కూడా కరోనా..!

|

Feb 29, 2020 | 7:24 AM

ఇప్పటి వరకు మనుషులకే కరోనా వచ్చిందని అనుకుంటున్న తరుణంలో హాంకాంగ్ వైద్యులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మనుషులకే కాదు.. కుక్క పిల్లలకు కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాపిస్తోందని తెలిపారు.

షాకింగ్.. కుక్క పిల్లలకు కూడా కరోనా..!
Follow us on

ఇప్పటి వరకు మనుషులకే కరోనా వచ్చిందని అనుకుంటున్న తరుణంలో హాంకాంగ్ వైద్యులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. మనుషులకే కాదు.. కుక్క పిల్లలకు కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాపిస్తోందని తెలిపారు. హాంకాంగ్‌లో నివసిస్తున్న ఓ మహిళతో పాటుగా.. ఆమె పెంచుకుంటున్న కుక్క పిల్లకు కూడా కరోనా సోకిందని వైద్యులు తెలిపారు.

హాంకాంగ్‌లో జుహాయ్‌ మకావో వంతెనకు సమీపంలో నివసిస్తున్న యువన్నె చెవ్‌ అనే వృద్ధ మహిళకు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.దీంతో వెంటనే ఆమెను అదే రోజు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. అయితే ఆ తరువాతి రోజు.. వైద్య అధికారులు ఆమె ఇంటికి వెళ్లి ఆమె పెంపుడు కుక్క పిల్లను తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. వచ్చిన రిజల్ట్స్ చూసి.. షాక్ తిన్నారు. ఆ పరీక్షలో ఆ కుక్క పిల్లకు కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆ కుక్క పిల్లను కూడా 14 రోజులపాటు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు.

అయితే ఈ సమాచారం తెలిసిన వెంటనే హాంకాంగ్‌లోని ప్రజలు వారివారి పెంపుడు జంతువులకు మాస్క్‌లు తగిలిస్తున్నారు. కాగా.. కోవిడ్‌ సోకిన కుక్క పిల్లల నుంచి తిరిగి మనుషులకు సోకుతున్నట్లు ఇప్పటి వరకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యులు తెలిపారు.మరోవైపు.. చైనాలోని వుహాన్‌ మార్కెట్‌ నుంచి బయటపడిన ఈ కరోనా వైరస్..ఇంత వరకు కుక్కలకు, పిల్లులకు సోకినట్లు ఎక్కడా కూడా వార్తలు రాలేదు. పెంపుడు కుక్కల నుంచి యజమానులకుగానీ, యజమానుల నుంచి పెంపెడు కుక్కలకుగానీ ఈ వైరస్‌ సోకదని.. “యూసీ డేవిస్‌ స్కూల్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్‌” ప్రొఫెసర్ డాక్టర్‌ నీల్స్‌ పెడర్సన్‌ స్పష్టం చేశారు. అయితే ఇంకా ఈ విషయంపై హాంకాంగ్‌ వైద్యాధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు.