రంజాన్ సందర్భంగా బీట్ అల్ ఖైర్ సొసైటీ దాతృత్వం

| Edited By:

Mar 16, 2019 | 6:19 PM

ఎన్నో ఏళ్లుగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న బీట్ అల్ ఖైర్ అనే సొసైటీ ఆపదలో ఉన్న ఎంతో మందికి సాయమందిస్తోంది. 4,324 కుటుంబాలకు నెలకు కొంతమొత్తంలో డబ్బులిస్తోంది. 13,853 మంది విద్యార్థులను చదివిస్తోంది. 1735 మంది అనాథ పిల్లలను పెంచుతోంది. ఇంకా ఎంతో మంది పెషేంట్లకు, సీనియర్ సిటిజన్‌లకు తోచిన సాయం చేస్తోంది. ముస్లింలకు ప్రవిత్ర పండుగ అయిన రంజాన్‌ను పురస్కరించుకుని మరిన్ని మంచి పనులు చేసేందుకు సొసైటీ సభ్యులు ముందుకొచ్చారు. దుబాయ్ వ్యాప్తంగా పనిచేస్తున్న పేద […]

రంజాన్ సందర్భంగా బీట్ అల్ ఖైర్ సొసైటీ దాతృత్వం
Follow us on

ఎన్నో ఏళ్లుగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న బీట్ అల్ ఖైర్ అనే సొసైటీ ఆపదలో ఉన్న ఎంతో మందికి సాయమందిస్తోంది. 4,324 కుటుంబాలకు నెలకు కొంతమొత్తంలో డబ్బులిస్తోంది. 13,853 మంది విద్యార్థులను చదివిస్తోంది. 1735 మంది అనాథ పిల్లలను పెంచుతోంది. ఇంకా ఎంతో మంది పెషేంట్లకు, సీనియర్ సిటిజన్‌లకు తోచిన సాయం చేస్తోంది. ముస్లింలకు ప్రవిత్ర పండుగ అయిన రంజాన్‌ను పురస్కరించుకుని మరిన్ని మంచి పనులు చేసేందుకు సొసైటీ సభ్యులు ముందుకొచ్చారు.

దుబాయ్ వ్యాప్తంగా పనిచేస్తున్న పేద వలస కార్మికుల కోసం 100 మిలియన్ దిర్హమ్స్(రూ.187,75,66,018) కేటాయించారు. చాలి చాలని జీతాలతో పస్తులుంటూ కష్టాలు అనుభవిస్తున్న వలసదారుల కోసం రంజాన్ మాసంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్న వారికి సాయం చేస్తామన్నారు. అలాగే మూడు నెలలపాటు ప్రత్యేక ఇఫ్తార్ విందులకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెప్పారు. బీట్ అల్ ఖైర్ సొసైటీ గత రంజాన్ మాసంలో 40 పంపిణీ కేంద్రాల వద్ద 511,815 మందికి ఆరోగ్యకరమైన భోజనం పంపిణీ చేశారు.