వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 9.51 లక్షలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 9.51 లక్షలు..
Follow us

|

Updated on: Sep 18, 2020 | 8:09 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,410,423కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 951,517 మంది కరోనాతో మరణించారు. ఇక 22,092,762 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (Corona Cases In World)

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 6,879,675కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 202,304 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, కొలంబియా, పెరు, మెక్సికో, దక్షిణాఫ్రికాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 5,228,478 కేసులు నమోదు కాగా.. 84,505 మంది వైరస్ కారణంగా మరణించారు.

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!