China: కరోనా తీవ్రతతో అల్లాడిపోతున్న చైనాలోని షాంగైలో ఇప్పటికే పరిస్థితులు విషమించాయి. రోజుల తరబడి కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనం ఆహారం, నిత్యావసర వస్తువులు నిండుకొని ఆకలితో అలమటించిపోతున్నారు. తినడానికి ఏమీ లేదు ఆదుకోవాలంటూ ఇళ్లలోని బాల్కానీలు, కిటికీల్లోంచి అరుపులు, కేకలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. షాంగైలో అధికారులు సరఫరా చేస్తున్న ఆహార పదార్ధాలు సరిపోకపోవడంతో జనం ఆంక్షలను పట్టించుకోకుండా రోడ్ల మీదకు వస్తున్నారు.. అక్కడక్కడా షాపుల లూటీలు జరుగుతున్నాయి.. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి ఇబ్బందులు మొదలయ్యాయి.
ఈ పరిస్థితులను ఆదుపు చేసేందుకు మరింత కఠినగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సర్వీసులు మినహా ఎవరూ రోడ్ల మీదకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ధరలు పెంచి అమ్మినా, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా శిక్షలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. నకిలీ పాస్‌లతో తిరిగినా, తప్పుడు సమాచారం, వదంతులు వ్యాపించజేసినా సహించబోమని స్పష్టం చేశారు. ఏకంగా జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు
చైనా వాణిజ్య రాజధాని షాంగై నగరంలో రెండున్నర కోట్ల మంది నివసిస్తున్నారు. ఇక్కడ కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విధిస్తున్న లాక్‌డౌన్, క్వారంటైన్ నిబంధనల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు రోజుల తరబడి నిలిచిపోయారు. పనులు లేకపోవడంతో ఆదాయం లేక, ఇళ్లకే పరిమితమై పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. డబ్బున్నవారికి సైతం ఆహార వస్తువులు దొరకక అలమటించిపోతున్నారు.
Also read: