ముగ్గురు వ్యోమగాములతో నింగికెగసిన చైనా అంతరిక్ష నౌక…..మేజర్ స్పేస్ పవర్ గా ఎదిగిన డ్రాగన్ కంట్రీ

చైనాలోని టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి గురువారం ముగ్గురు వ్యోమగాములతో కూడిన రాకెట్ నింగికి ఎగసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల 22 నిముషాల ప్రాంతంలో ఇది నిప్పులు చిమ్ముతూ అంతరిక్షానికి దూసుకుపోయింది.

ముగ్గురు వ్యోమగాములతో నింగికెగసిన చైనా అంతరిక్ష నౌక.....మేజర్ స్పేస్ పవర్ గా ఎదిగిన డ్రాగన్ కంట్రీ
China Rocket Carrying First
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 17, 2021 | 3:45 PM

చైనాలోని టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి గురువారం ముగ్గురు వ్యోమగాములతో కూడిన రాకెట్ నింగికి ఎగసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల 22 నిముషాల ప్రాంతంలో ఇది నిప్పులు చిమ్ముతూ అంతరిక్షానికి దూసుకుపోయింది. లాంగ్ మార్చ్-2 ఎఫ్ అనే ఈ రాకెట్ ప్రయోగాన్ని చైనా తన అధికారిక టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. అంతరిక్ష కేంద్రంలో ఈ వ్యోమగాములు మూడు నెలల పాటు ఉంటారు. కక్ష్యలో సుమారు 10 నిముషాలు ఉన్న రాకెట్ నుంచి అంతరిక్ష నౌక విడిపోగానే చైనా స్పేస్ ఏజెన్సీ ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. వ్యోమగాములు తమ హెల్మెట్ వైజర్లను ఎత్తి కెమెరా వంక చిరునవ్వుతో చూడడాన్ని స్టేట్ బ్రాడ్ కాస్టర్ సీసీటీవీ లైవ్ గా చూపింది. మరో యేస్ట్రోనట్ జీరో గ్రావిటీలో తన పెన్ ను గాలిలో ఎగురవేస్తూ కనిపించగా..అంతరిక్ష నౌక బయట గల కెమెరాలు కింద భూమికి సంబంధించిన ఇమేజిలను లైవ్ గా చూపాయి, దీనికి అమర్చిన సౌర ఫలకాలు విజయవంతంగా విఛ్చు కున్నాయని శెంజా-2 లాంచ్ పూర్తి సక్సెస్ అయిందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

రోదసి మిషన్ ప్రయాణానికి ముందు స్పేస్ సూట్లలో ఉన్న ముగ్గురు వ్యోమగాములను సపోర్టర్లు, స్పేస్ వర్కర్లు అభినందించారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ లేనిదే నవ చైనా లేదనే దేశభక్తి గీతాన్ని వారు ఆలపించారు. ఈ యేస్ట్రోనట్లకు అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. వీరికి ప్రత్యేక గదులు …. ఈ- మెయిల్ సదుపాయం కూడా ఉంటుంది. వీరు తమతో బాటు 120 రకాల ఫుడ్ ఐటమ్స్ ని తీసుకువెళ్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే వీటిని తీసుకువెళ్లారా అన్నది తెలియడంలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: New Coronavirus Variant: దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వెలుగుచూసిన మహమ్మారి..!

అంబానీ ఇంటివద్ద బాంబు కేసు…..300 ఎన్ కౌంటర్లు చేసిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మ అరెస్ట్