వావ్ ! ‘ఇట్స్ గాయబ్’ !’పోయిందే’ ! కరోనాపై చైనా విజయం !

కరోనా వ్యాప్తికి కారణమైన చైనా దీనికి చెక్ పెట్టి కట్టడి చేసింది. ప్రపంచ దేశాలను ఈ వ్యాధి వణికిస్తున్నప్పటికీ.. తాము మాత్రం దీన్ని అదుపు చేయగలిగామని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రకటించారు.

వావ్ ! 'ఇట్స్ గాయబ్' !'పోయిందే' ! కరోనాపై చైనా విజయం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 10, 2020 | 6:30 PM

కరోనా వ్యాప్తికి కారణమైన చైనా దీనికి చెక్ పెట్టి కట్టడి చేసింది. ప్రపంచ దేశాలను ఈ వ్యాధి వణికిస్తున్నప్పటికీ.. తాము మాత్రం దీన్ని అదుపు చేయగలిగామని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రకటించారు.  ఈ వ్యాధిపై తాము సాధించిన విక్టరీ ఇది అని అభివర్ణించారు. కోవిడ్-19 కంట్రోల్ లోనే ఉందనడానికి సూచనగా ఆయన ఊహాన్ లోని వివిధ ఆసుపత్రులను సందర్శించారు. క్వారంటైన్ లో ఉన్న రోగులను పరామర్శించారు. కొన్ని ఆస్పత్రుల్లో పేషంట్లను ఉద్దేశించి ప్రసంగించారు.   .వూహాన్ లో తాత్కాలికంగా 10 రోజుల్లో నిర్మించిన సుమారు 14 ఆసుపత్రులను మూసివేయడం విశేషం. కరోనాపై విజయాన్ని ప్రజలు ఆస్వాదించాలని బీజింగ్ పిలుపునిచ్చింది.    ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధికి గురై మరణించిన వారి సంఖ్య 4,060 కి పెరగగా.. లక్షా 14 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకినట్టు సమాచారం. చైనాలో తాజాగా 12 వేల మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.