Video: భారత్‌ గురించి ప్రశ్న.. ఎవరూ ఊహించని సమాధానం చెప్పిన చైనా రోబో.. ఏం చెప్పిందంటే..!

చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో)లో ఏర్పాటుచేసిన ఓ హ్యుమనాయిడ్‌ రోబోను ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మోడల్‌ స్త్రీ రూపాన్ని పోలి ఉన్న ఈ రోబో.. భారత్‌ గురించి సందర్శకులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం చెప్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఆరోబో ఏం చెప్పిందనే గా మీ డౌట్‌.. అయితే లేటెందుకు తెలుసుకుందాం పదండి.

Video: భారత్‌ గురించి ప్రశ్న.. ఎవరూ ఊహించని సమాధానం చెప్పిన చైనా రోబో.. ఏం చెప్పిందంటే..!
Humanoid Robot

Updated on: Sep 01, 2025 | 1:49 PM

చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సదస్సు( ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సును సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రధాని పుతిన్‌ సహా పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. చైనా ఇటీవలే రూపొందించిన ఒక హ్యుమనాయిడ్‌ రోబోను అధికారులు ఈ సదస్సులో ఏర్పాటు చేశారు. మోడల్‌ స్త్రీ రూపాన్ని పోలి ఉన్న ఈ రోబో అక్కడికి వచ్చిన సందర్శకులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో ఇంగ్లిషు, రష్యన్‌, చైనీస్‌ భాషల్లో సమాధానం చెప్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ రోబోను ఎవరైనా ప్రశ్నలు అడగేందుకు సిద్ధం కాగానే అది ఇవాళ నా గరిష్ఠ సామర్థ్యంతో నేను చేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడిగినందుకు మీకు ధన్యవాదాలు అంటూ సమాధానాలు చెప్పేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో అక్కడున్న ఒక వ్యక్తి భారత్ గురించి నీ ఆలోచనలు ఎంటో చెప్పు అని అడగా అది ఎవరూ ఊహించని సమాధానం చెప్పింది. నేను ఏఐ( ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌) సేవలు అందించే రోబోను. కాబట్టి దేశాలు, రాజకీయాలపై నా వ్యక్తిగత అభిప్రాయాలను నేను చెప్పలేనంటూ ఆ రోబో సామాధానం ఇచ్చింది. ఆ తర్వాత సమ్మిట్‌ గుంచి ఇతరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆ రోబో పూర్తి విషయాలను వెల్లగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.