China Bird Flu H3N8: చైనాలో మరో డేంజర్‌ వైరస్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు..!

|

Apr 27, 2022 | 1:03 PM

China Bird Flu H3N8: చైనా పుట్టినిల్లు అయిన కరోనా మమహ్మారి గత రెండేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తుంటే.. దానితో పాటు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి అతలాకుతలం..

China Bird Flu H3N8: చైనాలో మరో డేంజర్‌ వైరస్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు..!
Follow us on

China Bird Flu H3N8: చైనా పుట్టినిల్లు అయిన కరోనా మమహ్మారి గత రెండేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తుంటే.. దానితో పాటు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న కరోనా వైరస్‌.. కొత్త కొత్త వైరస్‌ (Virus)లు పుట్టుకొస్తున్నాయి. కరోనా కేసులతో సతమతం అవుతున్న డ్రాగన్‌ కంట్రీ చైనాను మరో వైరస్‌ కంగారుపెడుతోంది. ఏవియన్ ఫ్లూ H3N8 జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. అయితే ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇది ప్రజలలో ప్రబలే ప్రమాదం తక్కువగా ఉండటం. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న నాలుగేళ్ళ చిన్నారి జ్వరం, ఇతర లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు. పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్‌ అతనికి సోకిందని చెప్పారు. అయితే, బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్‌ సోకలేదని స్పష్టం చేశారు.

దీంతో చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివరాల ప్రకారం.. జునోటిక్‌ లేదా జంతువుల ద్వారా సంక్రమించే ఇన్‌ఫ్లూయెంజా ప్రాథమికంగా సోకిన జంతువులు లేదా కలుషితమైన పరిసరాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్‌లు మనుషుల మధ్య అంతగా వ్యాప్తి చెందవు చెందవని ఆరోగ్య అధికారులు వివరిస్తున్నారు. ప్రాణాంతకమైన న్యుమోనియా కారణమైన H3N8 వల్ల 2012లో అమెరికా ఈశాన్య తీరంలో 160 కంటే ఎక్కువ సీల్స్ మరణించాయి.

ఏవియన్ ఇన్‌ఫ్ల్యూయెంజా సాధారణంగా పౌల్ట్రీలు, అడవి పక్షులలో సంభవిస్తుంది. వాటి నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం అనేది చాలా అరుదు అని అధికారులు వెల్లడిస్తున్నారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. బర్డ్ ఫ్లూ H5N1,H7N9 స్ట్రెయిన్లను వరుసగా 1997, 2013లో గుర్తించారు. ఇవి ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా నుంచి మానవుల్లో అనారోగ్యానికి కారణమైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిన వివరాలు..

2021లో బర్డ్ ఫ్లూ లో మరో వేరియంట్ హెచ్5ఎన్8 సోకినట్టు సైంటిస్టులు గుర్తించారని రష్యా ప్రకటన చేసింది. 2021, జూన్ 1న 41ఏళ్ల వ్యక్తికి బర్డ్ ఫ్లూ వేరియంట్ హెచ్‌10ఎన్‌3 సోకిందని చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2003 జనవరి నుంచి 31 మార్చి 2022 వరకు 18 దేశాల్లో హెచ్5ఎన్1 863 హ్యూమన్ ఇన్ ఫెక్షన్ కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీరిలో మొత్తం 455 మంది మృతి చెందారు. తాజాగా 2022 జనవరిలో హెచ్5ఎన్1 హ్యుమన్ ఇన్ ఫెక్షన్ కేసు నమోదయిందని,
మనిషికి సోకేందుకు ఆస్కారమున్న ఇతర బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు తెలిపింది. హెచ్5ఎన్6, హెచ్7ఎన్4, హెచ్9ఎన్2, హెచ్10ఎన్3 ఇలాంటి ఇందులో వేరియంట్ల ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

మనుషులకు ఎలా సోకుతుంది?

పక్షుల ద్వారా పలు దేశాల్లోకి బర్డ్ ఫ్లూ విస్తరణ సాగుతుందని వెల్లడించింది. వ్యాధి సోకిన పక్షి మలం, ముక్కు, నోరు లేదా కళ్ళ నుంచి విడుదలయ్యే స్రావాలు అంటుకుంటే, వాటి ద్వారా వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు.

వ్యాధి సోకిన వారిలో కన్పించే లక్షణాలు..

మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ వ్యాధుల లక్షణాల మాదిరిగానే బయటపడతాయి. దగ్గు, జ్వరం, తలనొప్పి, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, ముక్కు కారటం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు.ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Suicide Bomber: ఆత్మాహుతి దాడి చేసిన మహిళా ఉగ్రవాదికి సంబంధించి సంచలన విషయాలు.. వీడియోలో దాడి దృశ్యాలు

Kim Jong-un: రెచ్చగొడితే అణు బాంబు వేస్తా.. అమెరికాకు కిమ్ మామ స్ట్రాంగ్‌ వార్నింగ్‌