Viral News: కార్లు క్లీన్ చేసే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. దెబ్బకు మారిన ఫేట్.. ఏకంగా కోట్లలో లాటరీ

|

Sep 22, 2022 | 9:20 PM

తన జీవితం చాలా కష్టాల్లోనే గడిచిందని భరత్ చెప్పాడు. గత మూడేళ్లుగా కార్ వాష్‌ చేసే పనిచేస్తున్నాడు. అతని సోదరుడి ఆరోగ్యం క్షిణీంచింది. అతనికి బ్రెయిన్ ట్యూమర్..

Viral News: కార్లు క్లీన్ చేసే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. దెబ్బకు మారిన ఫేట్.. ఏకంగా కోట్లలో లాటరీ
Car Washer In Dubai
Follow us on

Viral News: లాటరీ ప్రజల జీవితాన్ని మార్చేస్తుంది. నిరుపేదలకు లాటరీ టిక్కెట్లు లభించిన సంఘటనలు ఇటీవల చాలానే చూశాం..కొద్ది రోజుల క్రితం కేరళకు చెందిన రిక్షా డ్రైవర్‌కు 25 కోట్ల లాటరీ తగిలింది. ఆ తర్వాత దుబాయ్‌లో కార్ వాషర్‌గా పనిచేస్తున్న భరత్ అనే యువకుడు లాటరీలో 21 కోట్లు గెలుచుకున్నాడు. స్నేహితుల సలహాతో భరత్ లాటరీ టికెట్ కొన్నాడు.అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలవడం అతడు తన అదృష్టమేనంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

దుబాయ్‌లో కారును కడుగుతున్న వ్యక్తిని విధి వరించింది. ఒక్క దెబ్బతో రూ.21 కోట్లను తన ఖాతాలో వేసుకునేలా ఈ వ్యక్తి దశ తిరిగింది. నేపాల్‌కు చెందిన భరత్ అనే యువకుడు…మెహజూజ్ డ్రాలో రూ.21 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు.. ఈ డబ్బుతో తన కుటుంబ భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

తన జీవితం చాలా కష్టాల్లోనే గడిచిందని భరత్ చెప్పాడు. గత మూడేళ్లుగా కార్ వాష్‌ చేసే పనిచేస్తున్నాడు. అతని సోదరుడి ఆరోగ్యం క్షిణీంచింది. అతనికి బ్రెయిన్ ట్యూమర్.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తండ్రి కూడా ఇక్కడే రిక్షా నడుపుతుంటాడు. ఈ డబ్బుతో కుటుంబ సభ్యులకు సాయం చేస్తానన్నారు.

ఇవి కూడా చదవండి

భరత్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ లాటరీకి టికెట్ కొన్నట్లు చెప్పాడు. ఇంత భారీ మొత్తంలో లాటరీ తగిలిన భారత్ తన దేశంలో మొదటి విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 27న తన దేశమైన నేపాల్‌కు తిరిగి వస్తానని చెప్పారు. దీని తర్వాత అతను మళ్లీ దుబాయ్‌కి వచ్చి కేవలం డ్రాలో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని చెప్పాడు.

ఇటీవలే, కేరళలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ అదృష్టం మెరిసింది. అతని ఓనం బంపర్ లాటరీలో అతనికి రూ.25 కోట్ల లాటరీ వచ్చింది. తిరువనంతపురంలోని శ్రీవరాహం నివాసి అనూప్ శనివారం రాత్రి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు, దాని ఫలితాలు ఆదివారం ప్రకటించబడ్డాయి. పన్ను మినహాయించగా, అనూప్‌కు రూ.15.75 కోట్లు వస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి