
కెనడాలోని వాంకోవర్‌లో శనివారం(ఏప్రిల్ 26) రాత్రి జరిగిన ఒక ఉత్సవంలో జనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తి అయ్యిన తర్వాత మరిన్ని వివరాలను అందిస్తామని వాంకోవర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 30 ఏళ్ల డ్రైవర్ వాంకోవర్ నివాసి అని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం, శనివారం సాయంత్రం 8:15 గంటలకు (స్థానిక సమయం) కారు దక్షిణ వాంకోవర్ పరిసరాల్లోకి బీభత్సం సృష్టించింది.
అయితే, మృతుల సంఖ్యను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సంఘటనా స్థలం నుండి సోషల్ మీడియాలో వెలువడిన వీడియోలు వీధిలో చెల్లాచెదురుగా పడి ఉన్న అనేక మృతదేహాలను చూస్తుంటే మృతుల సంఖ్య భారీగానే ఉండవచ్చని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో ప్రకారం, నేరస్థలం పక్కన, నలిగిన బానెట్‌తో ఉన్న నీలిరంగు ట్రక్కు పక్కన, జనంలోకి దూసుకెళ్లిన ఒక నల్లటి SUV కనిపించింది. అనేక చిత్రాలు వీధిలో పడి ఉన్న గాయపడిన వారిని చూసుకుంటున్నట్లు చూపించగా, మరికొన్ని చిత్రాలు చుట్టూ మారణహోమం జరుగుతున్న ఆనవాళ్ల మధ్య జనం అర్తనాదాలు వినిపించాయి.
Vancouver Police tweets, "A number of people have been killed and multiple others are injured after a driver drove into a crowd at a street festival at E. 41st Avenue and Fraser shortly after 8 p.m. tonight. The driver is in custody. We will provide more information as the… pic.twitter.com/DWvfWO4IJv
— ANI (@ANI) April 27, 2025
ఇది కారు దాడినా లేక ప్రమాదమా అని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఒక నల్లటి SUV వాహనం వాంకోవర్‌లో లాపు-లాపు ఉత్సవంలోకి వేగంగా దూసుకెళ్లి జనం గుండా దూసుకెళ్లి అనేక మందిని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు. కారు డ్రైవర్ ఆసియా యువకుడని, మానసిక వికలాంగుడిగా కనిపించాడని స్థానికులు అంటున్నారు. ఈ భయంకరమైన సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వాటిలో కారు దాడి తర్వాత మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్నాయి.
#BREAKING: Mass-casualty event after an SUV plowed into a street festival in Vancouver. pic.twitter.com/hW2fDtzRYL
— Insider Wire (@InsiderWire) April 27, 2025
వాంకోవర్‌లోని లాపు-లాపు ఉత్సవంలో జరిగిన విషాదం గురించి తెలుసుకుని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా హ్యాండిల్ @X లో ఇలా రాశారు, మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు, ఫిలిప్పీన్స్ కెనడియన్ సమాజానికి చెందినవారని, వాంకోవర్‌లోని ప్రతి ఒక్కరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేమందరం మీతో పాటు దుఃఖిస్తున్నాము. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. తక్షణ చర్య తీసుకున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మార్క్ కార్నీ పేర్కొన్నారు.
లాపు-లాపు ఉత్సవం అంటే ఏమిటి?
ఈ పండుగ 16వ శతాబ్దపు ఫిలిపినో వలస వ్యతిరేక నాయకుడైన దాతు లాపు-లాపు జ్ఞాపకార్థం జరుపుకుంటారు. 1521లో జరిగిన మక్టాన్ యుద్ధంలో స్పానిష్ వలసవాదులపై స్పానిష్ వారిని విజయపథంలో నడిపించిన ఫిలిప్పీన్స్ తొలి జాతీయ వీరుడు లాపు-లాపు.
ఈ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని స్థానిక అధికారులు ఇంకా నిర్ధారించనప్పటికీ, యూరప్, యుఎస్, కెనడాలో కూడా ఇదే విధమైన నమూనా ఉద్భవించింది. ఇక్కడ రద్దీగా ఉండే ప్రదేశాలలో అనుమానాస్పద వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి వాహనాలను ఉపయోగిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, 42 ఏళ్ల అమెరికన్ వ్యక్తి షంసుద్-దిన్ జబ్బర్ తన పికప్ ట్రక్కును న్యూ ఓర్లీన్స్‌లోని రద్దీగా ఉండే వీధిలోకి నడిపాడు. అక్కడ సంతోషంగా వేడుకలు జరుపుకోవడానికి వచ్చి వారిపూ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఫలితంగా 14 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారు. చివరికి ఆ వ్యక్తిని కాల్చి చంపారు పోలీసులు. అతని కారు నుండి ISIS జెండాను స్వాధీనం చేసుకున్నారు. దీనిని దేశీయ ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన FBI, జబ్బర్ ISIS నుండి ప్రేరణ పొందాడని తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..