
Beauty Contests for Camels: శరీరం అందంగా కనిపించడం కోసం పలు రకాల ఎంతో డేంజరస్ కాస్మోటిక్ వాడుతుంటారు. మరీ ముఖ్యంగా మూవీ సెలబ్రిటీలు, అందాల పోటీల్లో పాల్గొనేవారు రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. అయితే ఇలా శరీరాకృతి కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి కటకటాల పాలైన వాళ్లు కూడా ఉన్నారు. కానీ అచ్చం అదే తరహాలో జంతువులపై కూడా ఉత్ప్రేరకాలను వాడి, వాటిని హింసకుక గురి చేస్తున్నారు సౌదీ అరేబయాన్ వాసులు.
సౌదీ రాజధాని రియాద్‌లో ప్రతి ఏడాది ఒంటెల పండుగను గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. నెల రోజుల పాటు జరిగిన ఫెస్ట్ కోసం.. ఒంటెలను అందంగా ముస్తాబు చేస్తుంటారు సౌదీ ప్రజలు. అంతే కాదు ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు 66 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చి సత్కరిస్తుంది. అయితే నిర్వాహకులు ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఫేస్ లిఫ్ట్‌లు వంటి ఇతర సౌందర్య సాధనాలను వినియోగించుకూడదనే ఒక నియమం విధించారు.
ఈ మేరకు ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఒంటెల పోటీల్లో మోసపూరిత చర్యలను అరికట్టే నిమిత్తం అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. దీంతో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు. చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్‌లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లు నిర్వాహకులు గుర్తించారు. ఒంటెలపై హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫెస్ట్ నిర్వాహాకలు.
Also read:
Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!