Viral Photo: బాతు వంటి పుష్పాలను కలిగి ఉన్న గడ్డి మొక్క.. దీని ప్రత్యేకతను గుర్తిస్తూ స్టాంప్ కూడా రిలీజ్..

|

Apr 11, 2022 | 5:27 PM

Flying Duck Orchid: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి.  వాటిని అన్వేషించే ఆసక్తి ఉండాలే కానీ.. ఎన్నో అద్భుతాలు మన కనుల ముందు విందు చేస్తాయి. ప్రకృతి వింతల్లో ఒకటి గడ్డి జాతి మొక్క కలేనా మేజర్..

Viral Photo: బాతు వంటి పుష్పాలను కలిగి ఉన్న గడ్డి మొక్క.. దీని ప్రత్యేకతను గుర్తిస్తూ స్టాంప్ కూడా రిలీజ్..
Flying Duck Orchid
Follow us on

Flying Duck Orchid: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి.  వాటిని అన్వేషించే ఆసక్తి ఉండాలే కానీ.. ఎన్నో అద్భుతాలు మన కనుల ముందు విందు చేస్తాయి. ప్రకృతి వింతల్లో ఒకటి గడ్డి జాతి మొక్క కలేనా మేజర్ (Caleana major). దీనిని , సాధారణంగా లార్జ్ డక్ ఆర్చిడ్(large duck orchid) ,  ఫ్లయింగ్ డక్ ఆర్చిడ్(Flying Duck Orchid) అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలు ఎక్కువగా తూర్పు ,  దక్షిణ ఆస్ట్రేలియాలో కనిపించే ఒక చిన్న ఆర్చిడ్. ఈ మొక్కల స్పెషల్ ఏమిటంటే.. బాతులాగా కనిపించే అద్భుతమైన పువ్వును కలిగి ఉంటుంది. ఈ పువ్వు మగ పురుగుల వంటి కీటకాలను ఆకర్షిస్తాయి. ఈ ఆర్చిడ్ కు ఆస్ట్రేలియన్ స్థానం ఇస్తూ వీటి 1986లో పోస్టల్ స్టాంప్‌ ను కూడా రిలీజ్ చేసింది.

కలేనా మేజర్ ఓషధ గుణాలు కలిగిన మొక్క. సాధారణంగా 20-40 సెం.మీ ఎత్తు పెరుగుతుంది. గడ్డిని తలపించే ఆకుల పై భాగంలో లేబెల్లమ్ పట్టీ లాంటి “మెడ” ఉన్న బాతు తలని పోలి ఉంటాయి. అందుకనే వీటిని డక్ ఆర్చిడ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆర్చిడ్  సెప్టెంబర్ నుండి జనవరి వరకు పుష్పిస్తుంది. అప్పుడు వీటిని సందర్శించడానికి ప్రకృతి ప్రేమికులు ఆసక్తిని చూపిస్తారు.

ఈ డక్ ఆర్చిడ్ గడ్డి మొక్కలు క్వీన్స్‌ల్యాండ్ , న్యూ సౌత్ వేల్స్ , విక్టోరియా , సౌత్ ఆస్ట్రేలియా , టాస్మానియాలో  ఎక్కువగా కనిపిస్తాయి. యూకలిప్టస్ అడవులలో, తీరప్రాంతం లేదా చిత్తడి పొదల్లో పెరుగుతాయి. అయితే వీటిని వ్యవసాయంగా సాగు చేయడం కొంచెం కష్టమైనా పని.. ఇక ఈ మొక్కలు జీవితకాలం కూడా తక్కువే.

Also Read: Railway News: ఆంధ్రప్రదేశ్‌ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ రూట్లలో రైళ్ల పునరుద్ధరణ..