గుండెపోటుతో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హఠన్మరణం.. విషాదంలో ఫ్యాన్స్!

|

Aug 31, 2023 | 9:31 AM

బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ లారిస్సా బోర్జెస్ (33) సోమవారం (ఆగస్టు 30) హఠన్మరణం చెందింది. కార్డియాక్ అరెస్ట్‌తో కేవలం 33 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. లారిస్సా బోర్జెస్ మృతికి సంబంధించిన వార్తను ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధృవీకరించారు. అనారోగ్యంతో గత వారం రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన..

గుండెపోటుతో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హఠన్మరణం.. విషాదంలో ఫ్యాన్స్!
Larissa Borges
Follow us on

బ్రెజిల్‌, ఆగస్టు 31: బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ లారిస్సా బోర్జెస్ (33) సోమవారం (ఆగస్టు 30) హఠన్మరణం చెందింది. కార్డియాక్ అరెస్ట్‌తో కేవలం 33 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. లారిస్సా బోర్జెస్ మృతికి సంబంధించిన వార్తను ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధృవీకరించారు. అనారోగ్యంతో గత వారం రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం కన్నుమూసింది. ‘బోర్జెస్ అతి చిన్న వయసులో మృతి చెందింది. కేవలం 33 ఏళ్లకే ఆమెను కోల్పోవడంతో మా హృదయాలు విరిగిపోయాయి. మేము అనుభవిస్తున్న దు:ఖం మాటలకందనిది’ అంటూ బోర్జెస్ కుటుంబ సభ్యులు షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బ్రెజలిల్‌లోని ఫెడరల్ జిల్లాకు చెందిన బోర్జెస్ ఆగస్టు 20న గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రి పాలైంది. దీంతో గత వారం రోజులుగా కోమాలోకి వెళ్లిన బోర్జెస్ రెండవసారి కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యింది. అనంతరం కొద్దిసేపటికే ఆమె మరణించింది. ఆగస్టు 20న తన కారులో గ్రామాడోలో ప్రయాణిస్తుండగా ఆమె మొదటిసారి కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యింది. ఆ సమయంలో ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. రెండవసారి గుండెపోటుకు గురైన కొద్దిసేపటికే మరణించింది. గుండెపోటుకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆల్కహాలిక్ పానీయాలు, మాదకద్రవ్యాలను తీసుకునే అలవాటు ఉన్నట్లు డిప్యూటీ గుస్తావో బార్సెల్లోస్‌ తెలిపారు. ఆమె తినే ఆహార పదార్థాలను ల్యాబ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. కాగా బోర్జెస్ తన ఫిట్‌నెస్, ఫ్యాషన్‌‌లకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్లు ఉన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.