బ్రెజిల్ అధ్యక్షుడి భార్యకు కరోనా పాజిటివ్

|

Jul 30, 2020 | 11:04 PM

కరోనా మహమ్మారి దేశాధినేతలను వారి కుటుంబాలను సైతం వదలడంలేదు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో భార్య మిషెల్, మరో మంత్రి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బ్రెజిల్ అధ్యక్షుడి భార్యకు కరోనా పాజిటివ్
Follow us on

కరోనా మహమ్మారి దేశాధినేతలను వారి కుటుంబాలను సైతం వదలడంలేదు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో భార్య మిషెల్, మరో మంత్రి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూలై ఏడో తేదీన జైర్ బొల్సొనారో కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. రెండు వారాల తర్వాత తనకు పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు ఇటీవలే ఆయన ట్వీట్ చేశారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని అనుకుంటుండగానే.. తాజా ఆయన భార్య కరోనా బారిన పడట్లు అధికారులు నిర్ధారించారు. ప్రథమ మహిళ మిషెల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు.. ఆమె అన్ని ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇక, ఆమెతో పాటు బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి మార్కోస్ పాన్‌టెస్ కూడా కొవిడ్ బారిన పడినట్టు గురువారం ప్రకటించారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇప్పటివరకు బొల్సొనారో ప్రభుత్వంలో ఐదుగురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. కాగా, బ్రెజిల్‌లో ఇప్పటివరకు 25,55,518 కొవిడ్ కేసులు నమోదుకాగా.. కరోనా బారినపడి 90,188 మంది మరణించారు.