
లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెసిడెన్షియల్ ప్లాట్స్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అన్ని ప్లాట్స్‌కు మంటలు వ్యాపించాయి. అందులో నివాసముంటున్న వారు భయంతో పరుగులు పెట్టారు. మొత్తం ఆరు అంతస్థులు ఉన్న ఈ నివాస సముదాయం మంటలకు పూర్తిగా కాలిపోయింది.
ఆదివారం సాయంత్రం స్థానిక డీపాన్ గార్డెన్స్ సమీపంలో నివాస సముదాయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ముందుగా నాలుగో అంతస్థులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత క్షణాల్లో అన్ని అంతస్థులకు మంటలు వ్యాపించాయని.. తాము భయంతో బయటకు పరుగులు పెట్టామని స్థానికులు తెలిపారు.
క్షణక్షణానికి మంటల తీవ్రత పెరగడంతో.. బాధితులను వెంటనే అక్కడి నుంచి దూరంగా తరలించారు. సమాచారం అందుకున్న 100 మంది అగ్నిమాపక సిబ్బంది.. 15 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదపుచేశారు.
అయితే ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. అధికారులు తెలిపారు. అయితే కోట్ల రూపాలయ ఆస్తి నష్టం వాటిల్లిందని.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.
The speed in which this fire in #barking spread was crazy! Nothing learned from #Grenfell #barkingfire pic.twitter.com/5mdceE4pAS
— MARAJA (@MARAJA_7) June 9, 2019