AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు శుభవార్త.. ట్రంప్ సర్కార్ నిర్ణయాలను కొట్టివేసిన అమెరికా ఫెడరల్ కోర్టు!

అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని, గ్రీన్ కార్డ్ సాధించాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు యూఎస్ ఫెడరల్ కోర్టు ఒక పెద్ద శుభవార్త అందించింది. దాదాపు 39 దేశాలకు చెందిన వలసదారుల గ్రీన్ కార్డ్‌లు, వర్క్ పర్మిట్‌లు, ఆశ్రయం, పౌరసత్వ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన కఠినమైన విధానాలను కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలు చట్టబద్ధంగా చెల్లవని స్పష్టం చేస్తూ రోడ్ ఐలాండ్‌లోని ఫెడరల్ కోర్టు చీఫ్ జడ్జి జాన్ మెక్‌కానెల్ కీలక తీర్పునిచ్చారు.

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు శుభవార్త.. ట్రంప్ సర్కార్ నిర్ణయాలను కొట్టివేసిన అమెరికా ఫెడరల్ కోర్టు!
Big Relief For Green Card
Balaraju Goud
|

Updated on: Jun 07, 2026 | 4:12 PM

Share

అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని, గ్రీన్ కార్డ్ సాధించాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు యూఎస్ ఫెడరల్ కోర్టు ఒక పెద్ద శుభవార్త అందించింది. దాదాపు 39 దేశాలకు చెందిన వలసదారుల గ్రీన్ కార్డ్‌లు, వర్క్ పర్మిట్‌లు, ఆశ్రయం, పౌరసత్వ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన కఠినమైన విధానాలను కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలు చట్టబద్ధంగా చెల్లవని స్పష్టం చేస్తూ రోడ్ ఐలాండ్‌లోని ఫెడరల్ కోర్టు చీఫ్ జడ్జి జాన్ మెక్‌కానెల్ కీలక తీర్పునిచ్చారు.

ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన ఈ నిబంధనల వల్ల ఎంతో మంది వలసదారుల జీవితాలు చట్టపరమైన సందిగ్ధతలో పడిపోయాయని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తన పరిధిని దాటి, చట్ట విరుద్ధంగా దరఖాస్తులను నిలిపివేసిందని కోర్టు పేర్కొంది. దరఖాస్తుదారులు అందరూ అమెరికా కాంగ్రెస్ రూపొందించిన చట్టాలను, నిబంధనలను సరిగ్గా పాటించినప్పటికీ కేవలం వారు పుట్టిన దేశాల ఆధారంగా వారి ప్రక్రియను నిలిపివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కోర్టు తీర్పుతో గత కొంతకాలంగా నిలిచిపోయిన గ్రీన్ కార్డ్, వర్క్ పర్మిట్ దరఖాస్తుల పునఃపరిశీలన ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆయా దేశాల నుండి వచ్చి చట్టబద్ధమైన నివాసం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీయులకు, వారిపై ఆధారపడిన కుటుంబాలకు ఈ నిర్ణయం ఎనలేని ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఈ తీర్పుపై పైకోర్టుకు అప్పీలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం దరఖాస్తుదారులకు ఇదొక పెద్ద విజయంగా ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us