అసలే ఇది హాట్ సమ్మర్,.. భానుడి భగభగలకు బాడీ అంతా హీటెక్కిపోతుంటే చల్లదనం కోసం మద్యం ప్రియులు కూల్‌కూల్ బీర్లను ఆశ్రయిస్తుంటారు. చల్ల చల్లగా బీరు గొంతులోకి దిగుతుంటే ఆ మజాయే వేరు అని బీరుబాబులు ఫీల్ అవుతుంటారు. బార్లీ గింజలతో..కొన్నిరకాల ధాన్యాలను నానబెట్టి..వాటిని పులియబెట్టి తయారు చేస్తారు. కానీ..సింగపూర్‌లో మాత్రం వెరీ డిఫరెంట్. అక్కడ తయారయ్యే ‘యూరిన్ బీర్’కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉందట. సాక్షాత్తూ అక్కడి ప్రభుత్వమే దీన్ని తయారు చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని పర్యావరణహిత బీర్‌గా చెబుతోంది సింగపూర్ ప్రభుత్వం. కమర్షియల్ సేల్స్‌ను కూడా మొదలు పెట్టింది. పబ్స్, బార్లలో ఈ బీర్ అందుబాటులో ఉంది. యూరిన్‌ని ఫీల్టర్ చేసి, తయారు చేసిన బీరు కోసం సింగపూర్ మందుబాబులు ఎగబడుతున్నారట.
సింగపూర్ నేషనల్ వాటర్ ఏజెన్సీ ఈ యూరిన్ బీర్ తయారీలో సక్సెస్ అయింది..సస్టెయినబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో నడిచే సంస్థ ఇది. జర్మన్ బార్లీ, నార్వే ఈస్ట్ లాంటివాటితో ఈ యూరిన్ బీరు తయారుచేస్తారట. అయితే, దీనిలో కీలకమైనది న్యూవాటర్…మురికినీటిని శుద్ధి చేయడం ద్వారా న్యూవాటర్ తయారుచేస్తారు. అంటే మూత్రంతోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చే మురికినీటిని ఇక్కడ శుభ్రం చేయడం ద్వారా న్యూవాటర్ వస్తుంది. బీరులో ఉండేది 90 శాతం నీరే. అంటే తాజా బీరులో 90 శాతం న్యూవాటరే ఉంటుంది. దీన్ని చాలా చాలా పరిశుభ్రంగా తయారుచేస్తారని, ఈ యూరిన్ బీరుని హాయిగా తాగొచ్చని సింగపూర్ అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ యూరిన్ వాటర్ తయారీ వెనుక ఓ ప్రజా ప్రయోజనం దాగి ఉందని చెబుతోంది సింగపూర్ సర్కార్. స్థానికంగా నెలకొన్న నీటి కొరతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆ సమస్యను అధిగమించడానికే ఈ యూరిన్ బీర్ ప్రయోగానికి తెర తీశామని నేషనల్ వాటర్ ఏజెన్సీ చెబుతోంది. దీనికి న్యూబ్రీవ్ అని పేరు పెట్టింది. ఇందులో కొంత మోతాదు వరకు సముద్రపు నీటిని కూడా వినియోగిస్తామని సింగపూర్ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు సభ్యుడు ర్యాన్ యూన్ తెలిపారు.
ఇకపోతే, ఈ యూరిన్ బీరుకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు సింగపూర్ వాసులు. టేస్ట్ చాలా బాగుందని, తాగేకొద్దీ తాగాలని అనిపిస్తుందంటున్నారు. నీటి కొరతను అధిగమించాలంటే, ఇలాంటి రిసైక్లింగ్ వ్యవస్థలు తప్పనిసరి అంటున్నారు మరికొందరు విశ్లేషకులు. మొత్తానికి యూరిన్ బీర్ మాత్రం మందుబాబులకు నోరూరిస్తుందనే చెప్పాలి..