పాకిస్తాన్‌ విమాన ప్రమాదం..ఆయనొక్కరే బ్రతికారా..!

| Edited By:

May 22, 2020 | 11:00 PM

పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాక్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలింది. ల్యాండింగ్‌కు ఒక్క నిమిషం ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో జనసాంద్రత గల జిన్నా గార్డెన్‌ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. కాగా ఈ ఘోర ప్రమాదంలో ఎంత మంది మరణించార్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ప్రస్తుతానికి ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతో స్థానికులకు కనిపించారు. వెంటనే ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స […]

పాకిస్తాన్‌ విమాన ప్రమాదం..ఆయనొక్కరే బ్రతికారా..!
Follow us on

పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాక్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలింది. ల్యాండింగ్‌కు ఒక్క నిమిషం ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో జనసాంద్రత గల జిన్నా గార్డెన్‌ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. కాగా ఈ ఘోర ప్రమాదంలో ఎంత మంది మరణించార్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ప్రస్తుతానికి ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతో స్థానికులకు కనిపించారు. వెంటనే ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా ఆ వ్యక్తి లాహోర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ అనే బ్యాక్‌కు ప్రెసిడెంట్ అయిన జాఫర్ మసూద్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు అవ్వగా.. ఆయనను ఆసుపత్రికి తరలించే వీడియోను ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

Read This Story Also: సల్మాన్‌ ఖాన్‌ని డైరెక్ట్ చేయబోతున్న పూరీ..!