బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ యువకుడిని కొట్టి చంపి, చెట్టుకు వేలాడదీసి దహనం..!

బంగ్లాదేశ్‌‌కు చెందిన ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాది సింగపూర్‌లో మరణించారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు మొహమ్మద్ యూనస్ గురువారం (డిసెంబర్ 18) రాత్రి ఈ మరణాన్ని ధృవీకరించారు. బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హది మరణంతో ఆగ్రహించిన తీవ్రవాదులు అనేక నగరాల్లో దహనం, విధ్వంసానికి పాల్పడ్డారు.

బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ యువకుడిని కొట్టి చంపి, చెట్టుకు వేలాడదీసి దహనం..!
Bangladesh Violence 1

Updated on: Dec 19, 2025 | 5:12 PM

బంగ్లాదేశ్‌‌కు చెందిన ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాది సింగపూర్‌లో మరణించారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు మొహమ్మద్ యూనస్ గురువారం (డిసెంబర్ 18) రాత్రి ఈ మరణాన్ని ధృవీకరించారు. బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హది మరణంతో ఆగ్రహించిన తీవ్రవాదులు అనేక నగరాల్లో దహనం, విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక హిందూ యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి, ఆపై నిప్పంటించారు.

ఉస్మాన్ హది ఇస్లామిక్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కు ప్రతినిధిగా ఉన్నారు. బంగ్లాదేశ్‌ ఎన్నికల ప్రచారం పాల్గొన్న హదిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి తలపై తుపాకీ కాల్చారు. తీవ్రంగా గాయపడ్డ హది చికిత్సపొందుతూ సింగపూర్ లో మరణించాడు. హాది మరణంతో ఆగ్రహించిన ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా అనేక నగరాలను లక్ష్యంగా చేసుకున్నారు. హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. భవనాలను ధ్వంసం చేసి, ఇళ్లను దోచుకున్నారు. ఈ క్రమంలోనే భాలుకా ప్రాంతంలో దీపు దాస్ అనే హిందూ యువకుడిని తీవ్రవాదులు తీవ్రంగా కొట్టి చంపారు. యువకుడి మృతదేహాన్ని దారుణంగా ముక్కలు చేశారు. దానిని తాడుతో చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు. హాది మరణం తరువాత, బంగ్లాదేశ్‌లోని అనేక జిల్లాలు తీవ్రవాదుల హింసాత్మక నిరసనలకు వేదికయ్యాయి. ఢాకాలో, హిందువులను బహిరంగంగా హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతిచోటా జిహాదీ నినాదాలు వినిపిస్తున్నాయి.

2024 నిరసనల సమయంలో విస్తృతంగా చర్చలోకి వచ్చిన ఇంక్విలాబ్ మంచ్ సంస్థకు ఉస్మాన్ హాది ప్రతినిధిగా ఉన్నారు. అప్పటి ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం కొన్ని రోజుల ముందే సార్వత్రిక ఎన్నికలను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో హాది పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత, ఆయనపై దాడి జరిగి చికిత్స పొందుతూ మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..