Earthquakes: నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు.. ఇదిగో వీడియో!

వెనిజులాలో వరుస భూకంపాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఒకదాని వెనుక ఒకటిగా సంభవించిన భూకంపాలు జనాల్లో తీవ్ర భయాందోళనలు కలిగించాయి. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా భారీగా స్థాయిలో భూమి కంపించడంతో చాలా ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. దీంతో చాలా మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.

Earthquakes: నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు.. ఇదిగో వీడియో!
Venezuela Earthquake Today

Updated on: Jun 25, 2026 | 6:59 AM

దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో బుధవారం సాయంత్రం వరుస భూకంపాలు బీభత్సం సృష్టించాయి. ఒకదాని వెనుక ఒకటిగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర కలకలం రేపాయి. దేశ రాజధాని అయిన కారకాస్‌తో పాటు చాలా నగరాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా భూప్రకంపనలకు మొదలయ్యాయి. ఈ భూకంప తీవ్రతకు కారకాస్‌ సహా చాలా ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదం కారణంగా చాలా మంది ప్రజలు గాయపడ్డారు.

ఒక్క నిమిషం వ్యవధిలో రెండు భూకంపాలు

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. ఒక్క నిమిషం వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు వెనిజులాలో సంభవించినట్టు దృవీకరించారు. 7.1 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది కాసేపటికే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. తొలి భూకంప కేంద్రం కారకాస్‌కు పశ్చిమంగా 168 కిలోమీటర్ల దూరంలోని కరేబియన్ తీరప్రాంతమైన మొరాన్ 13 కిలోమీటర్ల లోతులో నమోదుకాగా.. రెండో భూకంపం 16 కిలోమీటర్ల దూరంలోని 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్టు నివేదికలు పేర్కొన్నాయి.

వీడియోలు చూడండి..


కళ్లముందే కూలిన గోడలు.. వీధుల్లోనే ప్రజలు

ఈ భారీ భూకంపం ధాటికి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో భారీ భవనాల గోడలు ఒక్కసారిగా నేల కూలాయి. కొన్ని భవనాల్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. గోడల కూలి మీద పడడం కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు గాయాలపాలయ్యారు. కొందరు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కళ్లముందే జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మాల్స్‌లో ఇది పరిస్థితి


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us