బ్రెజిల్ లో ని ఆసుపత్రిలో ఇటీవల ఓ మహిళకు పుట్టిన బిడ్డను చూసి డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు. కారణం ? ఆ బిడ్డ ఏదీ సహించలేనట్టు చిరాకుగా ఉన్నట్టు ముఖం పెట్టడమే.. సిజేరియన్ ద్వారా పుట్టిన ఈ ఆడ శిశువు ఇలా ఎందుకు ఈ ముఖకవళికలను పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు ఆ చిన్నారి తల్లి కూడా తన బిడ్డ మూడ్ అర్థం కాక.. తెల్లబోయింది. సాధారణంగా పిల్లలు పుట్టగానే కెవ్వున ఏడుస్తారు.. కానీ ఈ గడుగ్గాయి మాత్రం అలా చేయలేదట. బహుశా కోవిడ్ మళ్ళీ తిరిగి వస్తోందన్న ఆందోళనతో ఈ శిశువు ఇలా అసంతృప్తిగా ముఖం పెట్టి ఉండవచ్చునని అనుకుంటున్నారు. రోడ్రిగో అనే ఫొటోగ్రాఫర్ ఈ వింత శిశువు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎక్కడో నూటికో, కోటికో కొంతమంది తల్లులకు ఇలాంటి బిడ్డలు పుడుతుంటారని కొందరు అంటే.. ఈ ఆడ శిశువుకు ఇప్పుడే ఇలాంటి మూడ్ ఉంటె పెరిగి పెద్దయ్యాక ఎలా తయారవుతుందో అని మరికొందరు చమత్కరించారు.
2018 లో ఓ మహిళకు పుట్టిన మగ బిడ్డ ఇలా లోకంలోకి పడ్డాడో లేదో, అలా నవ్వు ముఖం పెట్టాడట. మరో బిడ్డకు అప్పుడే నోటిలో పళ్లు కూడా వచ్చాయట.. ఇలాంటి విచిత్రాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. బహుశా మహిళలు గర్భం ధరించినప్పుడు వారి మూడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వారికి పుట్టే పిల్లల ముఖాల హావభావాలు కూడా ఉంటాయని సైకాలజిస్టులు భావిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.
ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.