బ్రిటన్ వైద్యులు అద్భుతం సృష్టించారు. ఇది ప్రపంచంలోనే తొలిసారి జరిగిన అరుదైన ఘటన. ఇంగ్లండ్ లో ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏతో ఒక శిశువు జన్మించింది. ఈ విషయాన్ని ఫెర్టిలిటీ నియంత్రణ సంస్థ ధ్రువీకరించింది. యూకే లో తల్లిదండ్రుల నుంచి 99.8 శాతం డీఎన్ఏ , మిగిలినది మహిళా దాత డీఎన్ఏతో శాస్త్రీయ పద్ధతిలో చేసిన ప్రయోగం ఫలించింది. ఈ ప్రయోగం చేయడానికి ప్రధాన కారణం మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించడమే. ఇలాంటి వైద్య విధానం ద్వారా ఐదుగురు పిల్లలు పుట్టారు. బ్రిటన్‌లో ఒకే ఒక్క బిడ్డ ఈ విధంగా జన్మించినట్లు చెబుతున్నారు.
మైటోకాండ్రియల్ వ్యాధులు నయం చేయలేనివి.ఈ వ్యాధితో పుట్టిన పిల్లలకు గంటల వ్యవధిలో లేదా రోజుల వ్యవధిలో మరణం సంభవించవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఈ బాధను అనుభవించారు. అలాంటి తల్లిదండ్రుల్లో ఈ టెక్నాలజీ కొత్త ఆశలు రేపుతోంది. మానవ శరీరంలోని ప్రతీ కణంలో మైటోకాండ్రియా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని మైటోకాండ్రియా శక్తిగా మార్చుతుంది. మైటోకాండ్రియాలో సమస్య ఉంటే అది ఆహారాన్ని శక్తిగా మార్చలేదు. ఫలితంగా మెదడుపై, కండరాలపై దుష్ప్రభావం పడుతుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. కళ్లు కూడా కనిపించవు. ఇది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే వ్యాధి. మైటోకాండ్రియల్ డొనేషన్ థెరపీ అనేది ఐవీఎఫ్ పరివర్తన రూపం. ఈ విధానంలో ఆరోగ్యకరమైన మహిళ అండం నుంచి మైటోకాండ్రియాను ఉపయోగిస్తారు.
ఈ లోపంతో పుట్టిన పిల్లలు చనిపోవచ్చు కూడా. ఈ వ్యాధి కారణంగా చాలా కుటుంబాలు తమ పిల్లలను కోల్పోయాయి. మైటోకాండ్రియా అనేది శరీరంలోని ప్రతి కణంలోని చిన్న భాగాలు. ఇవి ఆహారాన్ని శక్తిగా మారుస్తాయి. లోపభూయిష్ట మైటోకాండ్రియా శరీరానికి శక్తిని అందించలేకపోతుంది. ఇది మెదడు దెబ్బతినడం, కండరాల క్షీణత, గుండె వైఫల్యం, అంధత్వం మొదలైన వాటికి కారణమవుతుంది. మైటోకాండ్రియా సాధారణంగా తల్లి నుండి మాత్రమే సంక్రమిస్తుంది. దీనికి సొంత డీఎన్‌ఏ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలు డీఎన్‌ఏను వారసత్వంగా పొందుతారు. ఈ విధానంలో అండాన్ని దానం చేసిన మహిళ డీఎన్‌ఏ కూడా పుట్టబోయే పిల్లలకు చేరుతుంది. అలాగే రాబోయే తరాలకు కూడా ఈ డీఎన్ఏ సంక్రమణ జరుగుతూనే ఉంటుంది.
మైటోకాన్డ్రియల్ డొనేషన్ థెరపీ ఆరోగ్యకరమైన దాత గుడ్ల నుండి మైటోకాండ్రియాను ఉపయోగిస్తుంది. విరాళం ద్వారా జన్మించిన శిశువులు ఈ DNA మార్పును శాశ్వతంగా కలిగి ఉంటారు. కానీ రూపురేఖల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇది తరతరాలుగా సంక్రమిస్తుంది. 2015లో బ్రిటన్‌లో ఇలాంటి శిశువులు పుట్టేందుకు వీలు కల్పించే చట్టాలు వచ్చాయి. 2016లో అమెరికాలో చికిత్స పొందిన జోర్డాన్ కుటుంబానికి ఈ చికిత్స ద్వారా ప్రపంచంలోనే తొలి బిడ్డ జన్మించడం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..