
కొవిడ్ మహమ్మారి, 9/11 దాడులు, యువరాణి డయానా మరణాన్ని ఆమె ముందుగానే ఊహించారని చెబుతుంటారు. అయితే ఈ ఘటనలకు సంబంధించిన జోస్యాలను ఆమె నిజంగా చెప్పారనడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. కాగా 2027కు సంబంధించి ప్రచారంలో ఉన్న జోస్యం ప్రకారం.. ఏదో ఒక జన్యు ప్రయోగం లేదా అనారోగ్యం కారణంగా కొద్దిమంది వ్యక్తులు ‘సూపర్‌హ్యూమన్స్’గా మారతారట. మనిషి చేసే పనులను సెకన్లలో చేసే రోబోలను మించి మనిషిలా ఆలోచించే హ్యుమనాయిడ్ రోబోలకు రూపకల్పన జరుగుతోంది. బహుశా వాటినే బాబా వంగా సూపర్ హ్యూమన్స్ అని చెప్పారా? వాటి పరిణామం ఎలా జరుగుతుంది? వారి సామర్థ్యాలు ఎలా మారతాయి? అనే విషయాలపై మాత్రం ఎలాంటి వివరాలు లేవు. ఈ జోస్యం నిజమవుతుందా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.
తూర్పు ప్రాంతంలో ప్రారంభమై పశ్చిమ దేశాలకు విస్తరించే భారీ యుద్ధం 2026లో వస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు. దీనిని ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ కూడా అంచనా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తులు, భారీ భూకంపాలు, వరదలు సంభవిస్తాయని హెచ్చరించారు. టెక్నాలజీ వల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం వంటి నష్టాలు ఉంటాయని అంచనా వేశారు. భూమిపైకి అంతరిక్షం నుంచి భారీ నౌకల రాక లేదా ఏలియన్ల రాకపోకలు ఉంటాయని జోస్యం చెప్పారు.
ప్రపంచ యుద్ధం, వాతావరణ మార్పులతో ముడిపడిన ప్రకృతి విపత్తులు, సాంకేతికత నుంచి ముప్పు, గ్రహాంతరవాసుల సందర్శన వంటి పరిణామాలను బాబా వంగా ఊహించారని ఆమె అనుచరులు చెబుతున్నారు. తూర్పున ప్రారంభమై పశ్చిమ దేశాలకు విస్తరించే యుద్ధం జరుగుతుందని కూడా ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి పేర్కొన్నట్లు చెబుతున్నారు. 2026 నవంబరులో ఒక క్రీడా కార్యక్రమం సందర్భంగా గ్రహాంతరవాసులు వస్తారనే మరో జోస్యం కూడా ప్రచారంలో ఉంది.
ప్రపంచ ప్రఖ్యాత బల్గేరియన్ అంధ ప్రవక్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆమె చెప్పిన జోస్యాలలో కొన్ని ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు బాబా వంగా అంచనా వేసిన ‘గ్రేట్ వార్’ (పెద్ద యుద్ధం) ఆరంభమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మానవ మేధస్సుకు సవాల్ విసురుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం విస్తరిస్తుందని, ఇది భవిష్యత్తులో అనేక ఉద్యోగాల కోతకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలు బలహీనపడటం, అప్పుల భారం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటాయని, డిజిటల్ కరెన్సీపై ప్రభావం పడుతుందని ఆమె ముందే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జోస్యాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ఆమె గత అంచనాలపై ఉన్న నమ్మకాల ఆధారంగా ఇవి ప్రచారంలో ఉన్నాయి.