జార్జి ఫ్లాయిడ్‌కి కరోనా.. వెలుగులోకి కీలక విషయాలు..!

అమెరికాలో హత్యకు గురైన ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌కి కరోనా సోకినట్లు తేలింది. ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి కొన్ని క్లినికల్ వివరాలకు సంబంధించి హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం 20 పేజీల నివేదికను విడుదల చేసింది. ఫ్లాయిడ్ కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నివేదికను విడుదల చేయగా.. అందులో అతడికి కరోనా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న సమయంలో ఫ్లాయిడ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చిందని అందులో పేర్కొన్నారు. కాగా ఫ్లాయిడ్‌ది హోమిసైడ్(నరహత్య) అని మెన్నెపిన్ […]

జార్జి ఫ్లాయిడ్‌కి కరోనా.. వెలుగులోకి కీలక విషయాలు..!

Edited By:

Updated on: Jun 04, 2020 | 6:46 PM

అమెరికాలో హత్యకు గురైన ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌కి కరోనా సోకినట్లు తేలింది. ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి కొన్ని క్లినికల్ వివరాలకు సంబంధించి హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం 20 పేజీల నివేదికను విడుదల చేసింది. ఫ్లాయిడ్ కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నివేదికను విడుదల చేయగా.. అందులో అతడికి కరోనా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న సమయంలో ఫ్లాయిడ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చిందని అందులో పేర్కొన్నారు. కాగా ఫ్లాయిడ్‌ది హోమిసైడ్(నరహత్య) అని మెన్నెపిన్ కౌంటీ డాక్టర్లు స్పష్టం చేశారు.

ఏప్రిల్ 3న ఫ్లాయిడ్‌కి జరిపిన టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ, ఎలాంటి లక్షణాలు లేని అసింప్టమాటిక్‌గా వచ్చినట్లు చీఫ్‌ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ విడుదల చేసిన నివేదికలో తేలింది. ఫ్లాయిడ్ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. గుండెలో కాస్త అనారోగ్య సమస్యలు కనిపించాయని చెప్పారు. కాగా ఫ్లాయిడ్ మెడపై మిన్నియాపాలిస్‌కి చెందిన ఓ పోలీస్ అధికారి కాలితో బలంగా నొక్కిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో తనకు నొప్పిగా ఉందని, శ్వాస కూడా ఆడటం లేదని, వదిలేయాలని ఫ్లాయిడ్ పోలీసును ప్రాధేయపడ్డారు.

ఆ తరువాత మూర్ఛకు గురైన ఫ్లాయిడ్‌ని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు. దీంతో అమెరికా వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. శ్వేతసౌధాన్ని కూడా చుట్టుముట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన పోలీస్ అధికారి డెరిన్ చౌవిన్‌పై సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలను అప్‌గ్రేడ్ చేశారు. అలాగే డెరెక్‌కు సహకరించిన మరో ముగ్గురు అధికారులపై అభియోగాలు మోపారు.

Read This Story Also: అనంతపురం ‘కియా’ పరిశ్రమలో కరోనా కలకలం..!