Perth In Lockdown : ఆ నగరంలో బయల్పడ్డ ఒక్క కేసు..ఐదు రోజులు లాక్ డౌన్.. రెండు మిలియన్ల ప్రజలపై ఎఫెక్ట్

ప్రపంచాన్ని కరోనా ఏ రేంజ్ లో భయ పెట్టిందో తెలియజేస్తుందీ ఈ ఘటన.. ఆ నగరంలో ఒకే ఒక్క కరోనా కేసు వెలుగుచూడటంతో మొత్తం నగరాన్ని అష్ట దిగ్భంధం చేశారు. ఐదు రోజులపాటు..

Perth In Lockdown : ఆ నగరంలో బయల్పడ్డ ఒక్క కేసు..ఐదు రోజులు లాక్ డౌన్.. రెండు మిలియన్ల ప్రజలపై ఎఫెక్ట్

Updated on: Feb 01, 2021 | 12:50 PM

Perth In Lockdown : ప్రపంచాన్ని కరోనా ఏ రేంజ్ లో భయ పెట్టిందో తెలియజేస్తుందీ ఈ ఘటన.. ఆ నగరంలో ఒకే ఒక్క కరోనా కేసు వెలుగుచూడటంతో మొత్తం నగరాన్ని అష్ట దిగ్భంధం చేశారు. ఐదు రోజులపాటు లాక్‌డౌన్‌ విధించారు. దీంతో నగరంలో ఉన్న రెండు మిలియన్ల జనాభా పై దీని ప్రభావం పడింది. ఇది ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పెర్త్‌ నగరంలో ఓ క్వారంటైన్‌ హోటల్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టారు.

ఆదివారం నుంచి 5 రోజులపాటు నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ప్రజలను అనుమతిస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు కూడా వాయిదా పడ్డాయి. హోటల్‌లో విడిది చేసిన ఓ వ్యక్తి నుంచి సెక్యూరిటీ గార్డుకు వైరస్‌సోకి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే హోటల్ లో ఉన్న మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.. వారిలో 12 మందికి నెగిటివ్ గా రిజల్ట్ వచ్చింది.. మరికొందరి రిజల్ట్స్ రావాల్సి ఉందని అధికారులు చెప్పారు.

Also Read: ముద్దుల తనయని ఫ్యాన్స్ కి పరిచయం చేసిన విరుష్క జంట.. వామిక అంటే అర్ధం తెలుసా..!