Scott Morrison – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇష్టమైన వంటకాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వండి.. భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. భారతదేశంతో ఆస్ట్రేలియా (India-Australia) కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో స్కాట్ మారిసన్ ఇలా సెలెబ్రెట్ చేసుకున్నారు. ఈ మేరకు శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన కిచిడిని తయారు చేసిన ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భారత్‌తో తమ కొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో.. రాత్రి వేళ వంటల తయారీ కోసం ఎంచుకున్న ఆహారం ప్రియమైన మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ప్రాంతానికి చెందినవి అని మోరిసన్ పేర్కొన్నారు. అందులో ప్రధాని మోడీకి ఇష్టమైన కిచిడి (khichdi) ఉందంటూ ఆస్ట్రేలియా పీఎం మోరిసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఈ మేరకు ఆయన వంటగదిలో ఉన్న ఫొటోను షేర్ చేసి.. అందర్ని ఆశ్యర్యపరిచారు.
ఏప్రిల్ 2న భారతదేశం – ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం.. కాన్‌బెర్రా.. వస్త్రాలు, తోలు, ఆభరణాలు, క్రీడా ఉత్పత్తుల వంటి 95 శాతానికి పైగా భారతీయ వస్తువులకు మార్కెట్లో సుంకం రహిత యాక్సెస్ లభించనుంది. భారతదేశం-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం-పెట్టుబడి శాఖల మంత్రి డాన్ టెహన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, స్కాట్ మారిసన్ భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
కాగా.. ప్రధాని మోదీ తనకిష్టమైన ఖిచిడి గురించి పలు ఇంటర్వ్యూలల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యితో తయారు చేసిన భారతీయ సాంప్రదాయ వంటకం ఖిచిడి అంటే తనకిష్టమని.. దానిని వండడానికి ఇష్టపడతానంటూ పలుమార్లు ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.
Also Read: