
అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్‌లతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్వస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ఆయా దేశాల్లోని ఎగుమతులు, దిగుమలతుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆపిల్ సంస్థ ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇండియాలో ట్రంప్ టారిఫ్‌లు అమల్లోకి వస్తే ఐఫోన్‌ల ధర భారీగా పెరుగుతుందని.. అప్పుడు వాటి అమ్మకాలు తగ్గుతాయని ఆపిల్ సంస్థ ముందే గ్రహించింది. ఈక్రమంలో ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు అమల్లోకి రాక ముందే భారత్ నుంచి సుమార్ 600 టన్నుల అంటే దాదాపు 1.5 మిలియన్ల ఐఫోన్‌లను అమెరికాకు పంపేసింది.
ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై 125% టారిఫ్‌ను విధించగా, భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 26% టారిఫ్‌ను విధించాడు. అయితే చైనా మినహా మిగతా అన్ని దేశాలకు. మూడు నెలల వరకు ట్రంప్ సుంకాల విరామం ప్రకటించాడు. దీంతో ఎగుమతుల విషయంలో భారత్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ అవకాశాన్ని టెక్ దిగ్గజం ఆపిల్ సద్వినియోగం చేసుకుంది. భారతదేశంలోని అన్ని ఉత్పాదన కేంద్రాల నుంచి ఐఫోన్‌లను వేగంగా అమెరికాకు రవాణా చేసింది. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి ఆరు విమానాల్లో ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసింది.
ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 220 మిలియన్లకు పైగా ఐఫోన్‌లను విక్రయిస్తుంది, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనా ప్రకారం యూఎస్ మొత్తం ఐఫోన్ దిగుమతుల్లో ఐదవ వంతు ఇండియా నుంచి వెళ్తుండగా మిగిలినవి చైనా నుండి వస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి