Viral news: మైనింగ్‌లో బయటపడ్డ అరుదైన రాయి.. పరిశోధనలో అదేంటో తెలిసి అందరూ స్టన్

|

Jul 27, 2022 | 5:45 PM

లూలా రోజ్‌గా పిలుస్తున్న ఆ వ‌జ్రాన్ని లూలో మైన్‌లో మైనర్లు కనుగొన్నారు. గ‌డిచిన 300 ఏళ్లలో ఇలాంటి వ‌జ్రాన్ని చూడ‌లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

Viral news: మైనింగ్‌లో బయటపడ్డ అరుదైన రాయి.. పరిశోధనలో అదేంటో తెలిసి అందరూ స్టన్
Rare Pure Pink Diamond
Follow us on

Rare Pink Diamond:  అరుదైన, స్వచ్ఛమైన, అతిపెద్ద పింక్‌ డైమండ్ ఒకటి తవ్వకాల్లో బయట పడింది. ఆంగోలా గ‌నుల్లో ఈ అరుదైన అతిపెద్ద పింక్ డైమండ్ ల‌భ్య‌మైంది. సిడ్నీ దేశంలోనే వజ్రాలు అధికంగా ఉండే ఈశాన్య ప్రాంతంలోని లులో గనిలో 170 క్యారెట్ల గులాబీ రంగు డైమండ్ కనుగొన్నారని లుకాపా డైమండ్ కంపెనీ తెలిపింది. లూలా రోజ్‌గా పిలుస్తున్న ఆ వ‌జ్రాన్ని లూలో మైన్‌లో మైనర్లు కనుగొన్నారు. గ‌డిచిన 300 ఏళ్లలో ఇలాంటి వ‌జ్రాన్ని చూడ‌లేద‌ని ఆస్ట్రేలియన్ సైట్ ఆపరేటర్ తెలిపారు. లూలా రోజ్‌గా పిలుస్తున్న ఆ వ‌జ్రం.. లూలో మైన్‌లో దొరికింది. అతి స‌హ‌జ‌మైన రీతిలో దొరికిన అతి అరుదైన వజ్రాన్ని ఆంగోలా ప్ర‌భుత్వం ఆహ్వానించిన‌ట్లు ఆప‌రేట‌ర్ చెప్పారు.

లూలో మైన్ నుంచి పింక్ వ‌జ్రం ల‌భించ‌డం ఇది రెండ‌వ‌సారి అని ఆంగోలా గ‌నుల‌శాఖ మంత్రి డ‌మాంటినో అజివేడో తెలిపారు. భారీ ధ‌ర‌కు ఆ వ‌జ్రాన్ని అంత‌ర్జాతీయ మార్కెట్లో అమ్మ‌నున్న‌ట్లు చెప్పారు. అయితే లూలో రోజ్ వ‌జ్రాన్ని క‌టింగ్‌, పాలిషింగ్ చేయాల్సి ఉంటుంది. దాని వ‌ల్ల ఆ వ‌జ్రం బ‌రువు 50 శాతం త‌గ్గిపోతుంది. గ‌తంలో 59.6 క్యారెట్ల పింక్ స్టార్ వ‌జ్రాన్ని హాంగ్‌కాంగ్ వేలంలో సుమారు 71.2 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్మేశారు. కొత్త‌గా దొరికిన పింక్ డైమండ్ అంత‌క‌న్నా ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి