
అహ్మదాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదం నుంచి ప్రపంచం తేరుకోకముందే మరో ఘటన కలకలం రేపింది. రష్యాలో అంగారా ఎయిర్‌లైన్స్ విమానం అదృశ్యం అయింది. 50 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం ATCతో సంబంధాలు కోల్పోయింది. దీంతో విమానం ఏమయిందనే ఉత్కంఠ నెలకొంది. అటు ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అంగారా ఎయిర్‌లైన్స్ రష్యా నుంచి చైనా సరిహద్దులోని అముర్ ప్రాంతంలోని టిండా పట్టణానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం దాని గమ్యస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సంబంధాలు తెగిపోయినట్లు భావిస్తున్నారు.
విమానంలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు సిబ్బందితో సహా 43 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారని ప్రాంతీయ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపారు. విమానం కోసం వెతకడానికి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు.