ఏప్రిల్ 22న సెయింట్ లూయిస్ జంతుప్రదర్శనశాలలో రెండు అముర్ చిరుతపులి పిల్లలు జన్మించాయి. 2010 తర్వాత ఈ జూలో ఈ అరుదైన పులి పిల్లలు మొదటిసారిగా జన్మించాయి. జూ నిర్వాహకులు తెలిపిన వివరాల మేరకు …దేశంలోని జంతుప్రదర్శనశాలల్లో అముర్ చిరుతపులుల జనాభా, వాటి జననాలపై అధికార యంత్రాంగం ఎక్కువ శ్రద్ధ వహిస్తోంది. ఎందుకంటే అవి ప్రపంచంలోనే అత్యంత అంతరించిపోతున్న పిల్లులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పుట్టిన రెండు అముర్ చిరుత పిల్లలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు జూ నిర్వాహకులు, అధికారులు. వాటికి అన్య, ఇరినా అని పేరు పెట్టారు. అన్య అంటే అర్థం “దయ” అని, ఇక ఇరినా అంటే “శాంతి”అని చెబుతున్నారు. ఈ నవజాత శిశువుల ఫోటోలు, వీడియోలను జూ అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఈ అరుదైన పులి పిల్లల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇకపోతే, వాటి తల్లిపేరు డాట్ శాన్.. డియాగో జంతుప్రదర్శనశాలలో డాట్ జన్మించింది. 2021 చివరలో సెయింట్ లూయిస్‌కు తరలించబడింది. కాగా, తల్లి డాట్ పుట్టిన పిల్లలు అన్య, ఇరినా ప్రస్తుతం ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయని జూ సిబ్బంది తెలిపారు. అయితే, వీటిని కొద్ది నెలల పాటు బిగ్ క్యాట్ కంట్రీలోని ప్రైవేట్ ఇండోర్ మెటర్నిటీ డెన్‌లో ఉంచనున్నట్టు జూ సిబ్బంది తెలిపారు. పిల్లలు బయట తిరిగేందుకు, వాటికి కావాల్సిన ఆహార సేకరణ చేసుకునేలా తయారయ్యేందుకు సమయం పడుతుందని చెప్పారు. అప్పటి వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.
ఇప్పుడే పుట్టిన చిరుతపులికి మొదటి కొన్ని నెలలు చాలా కీలకమని, జంతు సంరక్షణ బృందం తల్లి పిల్లలను నిశితంగా పరిశీలిస్తోందని జూ సిబ్బంది తెలిపారు. 2-వారాల చెకప్‌లో పిల్లలు 2.5 పౌండ్ల బరువును కలిగి ఉన్నాయని చెప్పారు. ఇది వాటి వయసుకి సరిపోతుందని చెప్పారు. వయసులో ఉన్న అముర్ చిరుతపులులు 60 నుంచి 125 పౌండ్ల మధ్య బరువు కలిగి ఉంటాయని చెప్పారు.
1991 నుండి సెయింట్ లూయిస్ జంతుప్రదర్శనశాలలో జన్మించిన మూడు లిట్టర్లలో మరో నాలుగు ఇతర పిల్లలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవుల్లో 100 కంటే తక్కువ అముర్ చిరుతపులులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
We are delighted to announce two critically endangered Amur leopard cubs were born at the Zoo! Dorothy gave birth to Anya (AH-nah) and Irina (eye-REE-nah) on Thursday, April 21. Their births give hope to this critically endangered species: https://t.co/7fx9lPinsJ #StlZoo pic.twitter.com/O3ZG1k5rFC
— Saint Louis Zoo (@stlzoo) May 19, 2022
“జంతుప్రదర్శనశాలల పరిరక్షణ ప్రయత్నం లేకపోవడం, జన్యు వైవిధ్యం కోల్పోవడం, అడవిలో దాని మనుగడకు ఇతర బెదిరింపుల కారణంగా ఈ జాతి అంతరించిపోతుందన్నారు.