Watch Video: టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. ప్రయాణికులు ఎలా తప్పించుకున్నారో చూడండి!

అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. మియామీకి బయల్దేరేందుకు సిద్ధమైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్‌లో టైర్ లోపం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రన్‌వేపై మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. అప్రమత్తమైన పైలట్ వెంటనే టేకాఫ్‌ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Watch Video: టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. ప్రయాణికులు ఎలా తప్పించుకున్నారో చూడండి!
American Airlines

Updated on: Jul 27, 2025 | 10:24 AM

అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. 173 మంది ప్రయాణికులతో శనివారం మియామీకి బయల్దేరేందుకు సిద్ధమైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ-3023లో ప్రమాదం చోటుచేసుకుంది. విమానం ల్యాండింగ్ గేర్‌లో టైర్ లోపం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రన్‌వేపై మొత్తం దట్టమైన పొగలు కమ్మకున్నాయి. ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమైన పైలట్ వెంటనే విమాన టేకాఫ్‌ను నిలిపివేశాడు. ఆ తర్వాత ప్లైట్‌లో ఉన్న 173 మంది ప్రయాణికులను సుక్షితంగా కిందకు దించి ఎయిర్‌పోర్టులోకి పంపించారు. అయితే కిందకు దించే సమయంలో ఒక ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తోంది.

అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా నుంచి మియామీ వెళ్లేందుకు బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం రన్‌వే నుంచి టేకాఫ్‌ అవుతున్న క్రమంలో దాని ల్యాండింగ్ గేర్‌లోని టైర్‌లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేనట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన మొత్తం దృశ్యాలు ఎయిర్‌పోర్టులోని కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. రన్‌పై మొత్తం పొగతో కమ్మకున్న విమానంలోంచి ప్రయాణికులు ఒక్కొక్కరిగాబయటకు రావడం కనిపిస్తోంది. ప్లైట్‌ లోంచి దిగుతున్న క్రమంతో ప్రయాణికుల ముఖాల్లో ఆందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ప్రమాద సమయంతో వాళ్లు భయంతో వణికిపోయినట్టు తెలుస్తోంది.

వీడియో చూడండి..

మరోవైపు ఈ ప్రమాదంపై డెన్వర్ ఎయిర్‌పోర్టు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. విమానం రన్‌వేపై ఉన్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు వారు పేర్కొన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఫస్ట్ రెస్పాండర్స్ టీమ్‌ వెంటనే డెన్వర్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చిందని.. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూటీమ్ వెంటనే మంటలు పూర్తిగా ఆర్పివేసినట్టు తెలిపారు. ప్లైట్‌లోంచి సురక్షితంగా కిందకు దించిన ప్రయాణికులకు బస్సుల ద్వారా టెర్మినల్‌కు పంపించినట్టు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.