జార్జియాలో దారుణం.. భార్య సహా నలుగురిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి..!

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లారెన్స్‌విల్లేలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా, ముగ్గురు పిల్లలు తప్పించుకోగలిగారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన భార్య తోపాటు ముగ్గురు బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. అతని ముగ్గురు పిల్లలు ఒక గదిలోని అల్మరాలో దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

జార్జియాలో దారుణం.. భార్య సహా నలుగురిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి..!
Georgia Shooting

Updated on: Jan 24, 2026 | 5:27 PM

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లారెన్స్‌విల్లేలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా, ముగ్గురు పిల్లలు తప్పించుకోగలిగారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన భార్య తోపాటు ముగ్గురు బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. అతని ముగ్గురు పిల్లలు ఒక గదిలోని అల్మరాలో దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని 51 ఏళ్ల విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతులను అతని భార్య మీము డోగ్రా, వారి ముగ్గురు బంధువులు నిధి చందన్, హరీష్ చందర్, గౌరవ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన కుటుంబ వివాదం కారణంగా జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల సమయంలో విజయ్ కుమార్ ముగ్గురు పిల్లలు ఒక గదిలోని అల్మరాలో దాక్కోవడంతో తప్పించుకోగలిగారని పోలీసులు వెల్లడించారు.

కుటుంబ వివాదానికి ఒక భారతీయ సంతతి కుటుంబ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన శుక్రవారం (జనవరి 23, 2026) తెల్లవారుజామున లారెన్స్‌విల్లేలో జరిగింది, ఈ ఘటనలో ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు మరణించారు. సంఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, కానీ వారు తప్పించుకోగలిగారు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బ్రూక్ ఐవీ కోర్టు ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంటి లోపల నలుగురు పెద్దల మృతదేహాలను కనుగొన్నారు. వీరందరూ తుపాకీ గాయాలతో మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఒక మహిళతోపాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు.

ఈ సంఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సంఘటన కుటుంబ వివాదానికి సంబంధించినదని, ఒక భారతీయ కుటుంబం మరణానికి దారితీసిందని దౌత్య కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “X”లో పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేశామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నామని దౌత్య కార్యాలయం పేర్కొంది.

నిందితుడిని అట్లాంటా నివాసి అయిన 51 ఏళ్ల విజయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో విజయ్ కుమార్ భార్య మీము డోగ్రా (43), గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38) ఉన్నారని పోలీసులు తెలిపారు. విజయ్ కుమార్ పై హత్య, తీవ్రమైన దాడి, పిల్లలపై క్రూరత్వం వంటి అనేక తీవ్రమైన అభియోగాలు మోపిన పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ దారుణ సంఘటనలో ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు తప్పించుకోగలిగారు. కాల్పులు ప్రారంభమైన వెంటనే పిల్లలు ఒక గదిలోని అల్మరాలో దాక్కున్నారు. పిల్లలలో ఒకరు ధైర్యంగా 911 కు ఫోన్ చేసి సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీస్ బృందాలు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలకు శారీరకంగా ఎటువంటి హాని జరగలేదు. తరువాత వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..