Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

Air India Flight: విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రదక్షిణలు చేసి, ఆపై ఫుకెట్ విమానాశ్రయంలో తిరిగి దిగింది. బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న విషయం ఇంకా తేలాల్సిఉంది. అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది..

Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

Updated on: Jun 13, 2025 | 1:25 PM

థాయిలాండ్‌లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 379 బాంబు బెదిరింపు రావడంతో థాయిలాండ్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఉన్న 156 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రదక్షిణలు చేసి, ఆపై ఫుకెట్ విమానాశ్రయంలో తిరిగి దిగింది. బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న విషయం ఇంకా తేలాల్సిఉంది. అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

AI 379 విమానం ల్యాండ్ అయిందని, పరిస్థితిని మరింతగా ఎదుర్కోవడానికి విమానాశ్రయం అత్యవసర సేవలతో కలిసి పనిచేస్తోందని ఒక అధికారి తెలిపారు. శుక్రవారం థాయ్ ద్వీపం ఫుకెట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే, వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి