Mosquito Burgers: ఆకలి తీర్చుకునేందుకు దోమల బర్గర్లు తింటున్న ఆ పేద దేశ ప్రజలు

|

May 28, 2022 | 11:46 AM

ఆ దేశ ప్రజలు ఈ దుస్థితి నుంచి బయటపడలేకపోతున్నారు. తినడానికి సరైన తిండి లేకపోయినా ఆకలి ఆగదు కదా.. అందుకనే తమకు దొరికిన పదార్ధాలతో ఆహారాన్ని తయారు చేసుకుని తింటారు. తాజాగా ఆ దేశస్థులు కొత్తగా దోమలతో బర్గర్లు తయారుచేసుకుని తింటున్నారు.

Mosquito Burgers: ఆకలి తీర్చుకునేందుకు దోమల బర్గర్లు తింటున్న ఆ పేద దేశ ప్రజలు
Mosquito Burgers
Follow us on

Mosquito Burgers: ప్రపంచంలో ఆసియా తర్వాత రెండవ అతి పెద్ద ఖండం ఆఫ్రికా (Africa). ఈ ఖండాన్ని చీకటి ఖండమని పిలుస్తారు. అంతేకాదు ఇక్కడ నివసించే ప్రజలు అత్యంత పేదవారు. తినడానికి సరైన తిండి కూడా లేనివారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఆయుస్సు కలిగిన ప్రజలు ఈ ఖండంలోనే వారే.. దీని ముఖ్య కారణం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడమే.. అందుల్లనే ఆఫ్రికా ఖండం అనగానే.. ముందుగా అందరి కళ్ళ ముందు కనిపించేది.. పేదరికంలో మగ్గుతున్న ప్రజలు. ఆ దేశ ప్రజలు ఈ దుస్థితి నుంచి బయటపడలేకపోతున్నారు. తినడానికి సరైన తిండి లేకపోయినా ఆకలి ఆగదు కదా.. అందుకనే తమకు దొరికిన పదార్ధాలతో ఆహారాన్ని తయారు చేసుకుని తింటారు. తాజాగా ఆ దేశస్థులు కొత్తగా దోమలతో బర్గర్లు తయారుచేసుకుని తింటున్నారు. ఏమిటి దోమలను తింటున్నారా అంటూ.. కొందరు ఛీ ఛీ అంటుంటే.. మరికొందరు.. అయ్యో అక్కడ ప్రజలు ఎంత దీన స్థితిలో ఉన్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్రికాలో దోమలు లేని ప్రదేశం ఉండదు. ఇక్కడ దోమలు భారీ సంఖ్యలో విహరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ బడితే అక్కడ దోమలు విహరిస్తూ ఉంటాయి. దీంతో వీటిని పట్టుకుని తినే ఆహారంగా ఉపయోగిస్తున్నారు. వాటిని గిన్నెల సహాయంతో పట్టుకుంటున్నారు.  గిన్నెలను తాకి దోమల కళ్లు తిరిగి అందులోకి వస్తాయి. అలా గిన్నెల్లోకి వచ్చిన దోమలను బాగా నొక్కి.. ముద్దగా చేస్తారు. అనంతరం ఆ ముద్దను చికెన్ బర్గర్ మాదిరి తయారు చేసి నూనెలో బాగా వేయించి తింటారు. ఈ బర్గర్లు క్రంచీగా ఉంటాయి. వీటిని మసాలాలు లేకుండా రుచిగా తయారు చేసుకుని తింటున్నారు. ఇలా ఒకొక్క మస్కిటో బర్గర్‌కు దాదాపు 5 లక్షల దోమలు అవసరం అవుతుందట.

ఆరోగ్య ప్రయోజనాలు: ఈ దోమల్లో పోషకాలు కూడా అధికంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. దీంతో దోమలతో తయారు చేసిన బర్గర్లను తినడం ద్వారా ఆఫ్రికన్లు  ప్రోటీన్లు పొందుతారు. దోమల్లో పశు మాంసం కంటే 7 రెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి త్వరగా జీర్ణమవుతాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. ప్రభుత్వం ఎలా అక్కడ ప్రజలను ఆదుకోలేకపోతోంది. కనీసం ప్రకృతి అయినా దోమల రూపంలో వారి ఆకలిని తీస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి