Afghanistan Crisis: పాక్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌‌లో నిరసనలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు..

కాబూల్‌లో హై టెన్షన్‌ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్‌ సహకరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆఫ్ఘన్స్‌. పాక్‌ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు.

Afghanistan Crisis: పాక్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌‌లో నిరసనలు.. కాల్పులు జరిపిన తాలిబన్లు..
Afghan Womens

Updated on: Sep 07, 2021 | 1:48 PM

కాబూల్‌లో హై టెన్షన్‌ నెలకొంది. తాలిబన్లకు పాకిస్తాన్‌ సహకరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆఫ్ఘన్స్‌. పాక్‌ ఎంబసీ వద్ద ఆందోళనలకు దిగారు. కాబూల్‌లో ఆందోళనకారులపై తాలిబన్ బలగాల కాల్పులకు తెగబడింది. కాబూల్‌లోని పాకిస్తాన్‌ ఎంబసీ ఎదురుగా స్థానికుల ఆందోళనకు దిగారు. ఆఫ్ఘనిస్తాన్‌ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పాకిస్తాన్‌ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతం హోరెత్తిపోయింది.

అయితే నిరసనలను జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. నిరసనకారులపైకి కాల్పులకు తెగబడంతో అక్కడి వచ్చిన నిరసనకారులు పరుగులు పెట్టారు. చర్చలకు తమ వద్ద చోటు లేదంటూ తాలిబన్లు మరోసారి నిరూపించుకున్నారు.